అన్వేషించండి

Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్‌ ఫొగాట్‌

Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు.

Vinesh Phogat accuses WFI: ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat)  రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (WFI) అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌(Sanjai Singh)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, తన  సహాయ సిబ్బందికి అనవసరమైన అడ్డంకులు కలిగించడం ద్వారా తాను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌(Asian Olympic qualifying tournament) పోటీల్లో తాను పాల్గొనకుండా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. తనను డోపింగ్‌ కేసులో ఇరికిస్తారేమోనని భయంగా ఉందన్నారు. 

రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో తను  ఆడకుండా అడ్డుకునేందుకు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ , ఆయనకు డమ్మీగా ఉన్న సంజయ్‌ సింగ్‌లు అన్ని రకాలుగా  ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ కోచ్‌లుగా నియమితులైన వారందరూ  బ్రిజ్‌ భూషణ్‌ కు   సన్నిహితులే అని, తనాపై  ఉన్నకోపంతో   మ్యాచ్‌ మధ్యలో  ఇచ్చే తాగునీటిలో ఏదైనా కలిపి ఇచ్చే అవకాశం ఉందంటూ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో  వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు. డోపింగ్‌ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని తాను భావిస్తున్నానన్నారు. 

పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగం కోసం ప్రయత్నిస్తున్న వినేష్  ఫొగాట్‌ వచ్చేవారం కిర్గిజ్‌స్థాన్‌లో జరగనున్న ఏషియన్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. అయితే ఈ  ఈవెంట్‌ కోసం తన వ్యక్తిగత కోచ్‌, ఫిజియోలకు అక్రిడిటేషన్‌లు నిరాకరించారని వినేశ్‌  చెబుతున్నారు. ఇందుకోసం సుమారు నెల రోజులుగా తాను  ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.  అయితే ఈ విషయంపై  వినేశ్  ఆరోపణలను ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఎంట్రీలను పంపడానికి గడువు ముగిసిందని, వినేష్ అభ్యర్థన మెయిల్ మార్చి18న వచ్చిందని, అయితే అప్పటికే  ప్లేయర్లు, కోచ్‌లు మరియు వైద్య సిబ్బంది ఎంట్రీలను వరల్డ్ గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కి పంపేసినట్టు తెలిపింది. 

 లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు తీవ్రంగా పోరాడారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా తరువాత ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్ ఎన్నికయ్యారు. ఈ విషయంపై కూడా వీరు వ్యతిరేకంగా స్పందించారు. 

మరోవైపు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కి  గత ఫిబ్రవరి లో భారీ ఊరట లభించింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (United World Wrestling) కీలక నిర్ణయం తీసుకుంది. WFIపై నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిబ్రవరి 13 రాత్రి ప్రకటించింది. అప్పటి డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు వేధింపులు, అత్యాచార ఆరోపణలతో ఆందోళన బాట పట్టడంతో నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. దాంతో భారత రెజ్లింగ్ సమాఖ్యను యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ గత ఏడాది సస్పెండ్‌ చేయడం తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐలో అంతర్గతంగా విభేదాలు, బ్రిజ్ భూషన్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన రెజ్లింగ్ నుంచే తప్పుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget