అన్వేషించండి

Ind vs Pak, T20 WC LIVE: 17.5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 152-0, పది వికెట్లతో పాకిస్తాన్ విజయం

T20 World Cup, Ind vs Pak LIVE: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ నేటి మ్యాచ్‌లో తలపడుతున్నాయి.

LIVE

Key Events
Ind vs Pak, T20 WC LIVE: 17.5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 152-0, పది వికెట్లతో పాకిస్తాన్ విజయం

Background

ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రెండు దేశాల్లో ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ రెండు జట్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ అంటే రెండు దేశాలూ పూర్తిగా స్తంభించిపోతాయి.  టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా, పాకిస్తాన్ ఇప్పటివరకు ఐదు సార్లు తలపడగా.. ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియాదే విజయం. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టై కాగా.. భారత్ బౌల్ అవుట్‌లో విజయం సాధించింది. అదే కప్ ఫైనల్‌లో కూడా భారత్, పాకిస్తానే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లో ఉండగా.. మిస్బా స్కూప్ షాట్ ఆడటం, ఆ బంతి నేరుగా శ్రీశాంత్ చేతుల్లో పడటం, ఆ తర్వాత కప్ మన చేతికి రావడం ఎవరూ మర్చిపోలేరు.

ప్రస్తుత బలాబలాలను చూస్తే.. రెండు జట్లూ రెండేసి వార్మప్ మ్యాచ్‌లు ఆడాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవగా.. పాకిస్తాన్ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఇండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్ సూపర్ ఫాంలో ఉన్నాడు. తనకు తోడుగా ఓపెనింగ్ చేయనున్న రోహిత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఇక వన్‌డౌన్‌లో రానున్న కెప్టెన్ కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తన ప్రస్తుతం ఫాం కాస్త ఇబ్బందికరంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా.. ఇలా బ్యాటింగ్ లైనప్ అంతా విధ్వంసకర బ్యాట్స్‌మెనే.

ఇక బౌలింగ్ కూడా బ్యాటింగ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉంది. బుమ్రా, షమీ, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్.. ఇలా అందరూ ఐపీఎల్‌లో పరుగులు కట్టడి చేయడంతో పాటు.. వికెట్లు కూడా తీసినవారే. అయితే ఆరోజు ఎలా ఆడారు అన్నదానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది కాబట్టి.. వీరందరూ తమ 100 శాతం ప్రదర్శనను ఇవ్వాల్సిందే.

భారత్, పాకిస్తాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా... ఈ రెండు జట్లూ ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడటం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

పాకిస్తాన్ బ్యాటింగ్‌లో ప్రధానంగా బాబర్ ఆజమ్, ఫకార్ జమాన్, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ల మీదనే ఆధారపడింది. మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీంలు కూడా ఇటీవలి కాలంలో బాగానే రాణిస్తున్నారు. బౌలర్లలో షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీలు జట్టుకు కీలకంగా మారనున్నారు. పాకిస్తాన్ భారత్‌తో తలపడే మ్యాచ్‌లో ఉండబోయే 12 మంది ఆటగాళ్ల జాబితాను కూడా వెల్లడించింది. వీరిలో ఒకరు బెంచ్‌కి పరిమితం కానున్నారు.

పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీం, మహమ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది

23:00 PM (IST)  •  24 Oct 2021

17.5 ఓవర్లలో పాకిస్తాన్ స్కోరు 152-0, పది వికెట్లతో పాకిస్తాన్ విజయం

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు సాధించి పాకిస్తాన్ 10 వికెట్లతో విజయం సాధించింది.
బాబర్ ఆజమ్ 68(52)
మహ్మద్ రిజ్వాన్ 79(55)
మహ్మద్ షమీ 3.5-0-43-0

22:55 PM (IST)  •  24 Oct 2021

17 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 135-0, లక్ష్యం 152 పరుగులు

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 66(51)
మహ్మద్ రిజ్వాన్ 64(51)
భువనేశ్వర్ కుమార్ 3-0-25-0

22:47 PM (IST)  •  24 Oct 2021

16 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 128-0, లక్ష్యం 152 పరుగులు

మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 63(48)
మహ్మద్ రిజ్వాన్ 61(48)
మహ్మద్ షమీ 3-0-25-0

22:41 PM (IST)  •  24 Oct 2021

15 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 121-0, లక్ష్యం 152 పరుగులు

బుమ్రా వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 30 బంతుల్లో 31 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 62(46)
మహ్మద్ రిజ్వాన్ 56(44)
బుమ్రా 3-0-22-0

22:36 PM (IST)  •  24 Oct 2021

14 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 112-0, లక్ష్యం 152 పరుగులు

రవీంద్ర జడేజా వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. పాకిస్తాన్ విజయానికి 36 బంతుల్లో 40 పరుగులు కావాలి.
బాబర్ ఆజమ్ 61(45)
మహ్మద్ రిజ్వాన్ 48(39)
రవీంద్ర జడేజా 4-0-28-0

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Embed widget