News
News
X

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్.. ఆసీస్, కివీస్ లతో భారత్ వార్మప్ మ్యాచులు

T20 World Cup 2022:

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే 16 జట్లు వార్మప్ మ్యాచుల షెడ్యూలును ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 17 ఆసీస్ తో, 19 న న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. 

FOLLOW US: 

T20 World Cup 2022: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022లో పాల్గొనే 16 జట్లు వార్మప్ మ్యాచులు ఆడనున్నాయి. ఈ మేరకు వీటి షెడ్యూలును ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ మ్యాచులన్నీ బ్రిస్బేన్ మెల్ బోర్న్ లలో మధ్య ఉన్న అన్ని మైదానాలలో జరుగుతాయి. 

సూపర్- 12 దశలో ఉన్న జట్లు అక్టోబర్ 17, 19 తేదీల్లో అన్ని వార్మప్ మ్యాచులను ఆడతాయి. ఈ మ్యాచులు గబ్బా, అలెన్ బోర్డర్ మైదానంలో జరుగుతాయి. మొదటి వార్మపు మ్యాచ్ అక్టోబర్ 10న వెస్టిండీస్, యునైడెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జంక్షన్ ఓవల్ మైదానంలో ఆడుతుంది. మొదటి రౌండ్ జట్లలో ప్రతి జట్టూ రెండు వార్మప్ మ్యాచులు ఆడతాయి. అక్టోబర్ 16న నమీబియాతో శ్రీలంక వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.

అక్టోబర్ 17న గబ్బా వేదికగా భారత్ తో ఆతిథ్య ఆస్ట్రేలియా తన ఏకైక అధికారిక వార్మప్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత అక్టోబర్ 19న భారత్ గబ్బాలోనే న్యూజిలాండ్ తో తలపడుతుంది. 

ఈ వార్మప్ మ్యాచులన్నీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండవు. అయితే అక్టోబర్ 17, 19 తేదీల్లో గబ్బా మైదానంలో జరిగే 4 మ్యాచ్ లను ఐసీసీ గ్లోబల్ బ్రాడ్ కాస్ట్ పార్టనర్ స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఐసీసీ డిజిటల్ ఛానల్స్ అన్నింటిలో లైవ్ స్కోర్లు, హైలైట్స్ అందుబాటులో ఉంటాయి. ఈ మ్యాచులకు అంతర్జాతీయ టీ20 హోదా లేదు. 
 

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2022 వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ (స్థానిక కాలమానం ప్రకారం)

10 అక్టోబర్ - వెస్టిండీస్ వర్సెస్ యూఏఈ, జంక్షన్ ఓవల్, 11 గంటలకు

10 అక్టోబర్ - స్కాట్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్, జంక్షన్ ఓవల్, 3 గంటలకు

10 అక్టోబర్ - శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, ఎంసీజీ, 7 గంటలకు

11 అక్టోబర్ - నమీబియా వర్సెస్ ఐర్లాండ్, ఎంసీజీ, 7 గంటలకు

12 అక్టోబర్ - వెస్టిండీస్ వర్సెస్ నెదర్లాండ్స్, ఎంసీజీ, 7 గంటలకు

13 అక్టోబర్ - జింబాబ్వే వర్సెస్ నమీబియా, జంక్షన్ ఓవల్, 11 గంటలకు

13 అక్టోబర్ - శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్, జంక్షన్ ఓవల్, 3 గంటలకు

13 అక్టోబర్ - స్కాట్లాండ్ వర్సెస్ యూఏఈ, ఎంసీజీ, 7 గంటలకు

17 అక్టోబర్ - ఆస్ట్రేలియా వర్సెస్ భారత్, ది గబ్బా, 2 గంటలకు

17 అక్టోబర్ - న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అలన్ బోర్డర్ ఫీల్డ్, 2 గంటలకు

17 అక్టోబర్ - ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్, ది గబ్బా, 6 గంటలకు

17 అక్టోబర్ - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, అలన్ బోర్డర్ ఫీల్డ్, 6 గంటలకు 

19 అక్టోబర్ - ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్, ది గబ్బా , 1 గంటకు

19 అక్టోబర్ - బంగ్లాదేశ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అలన్ బోర్డర్ ఫీల్డ్,  6 గంటలకు

19 అక్టోబర్ - న్యూజిలాండ్ వర్సెస్ భారత్, ది గబ్బా, 6 గంటలకు

 

 

Published at : 08 Sep 2022 03:31 PM (IST) Tags: ICC T20 World Cup ICC t20 world cup news ICC t20 world cup warmup matches ICC t20 world cup latest news ICC t20 world cup teams

సంబంధిత కథనాలు

IND vs AUS 3rd T20: ఉప్పల్‌లో  కోహ్లీ క్లాస్‌.. సూర్య మాస్‌ కొట్టుడు! టీమ్‌ఇండియాదే సిరీస్‌

IND vs AUS 3rd T20: ఉప్పల్‌లో కోహ్లీ క్లాస్‌.. సూర్య మాస్‌ కొట్టుడు! టీమ్‌ఇండియాదే సిరీస్‌

IND vs AUS 3rd T20: చితక్కొట్టిన గ్రీన్, డేవిడ్‌! టీమ్‌ఇండియా ముగింట భారీ టార్గెట్‌

IND vs AUS 3rd T20: చితక్కొట్టిన గ్రీన్, డేవిడ్‌! టీమ్‌ఇండియా ముగింట భారీ టార్గెట్‌

IND vs AUS 3rd T20: ఈ గ్రీన్‌ ఎక్కడ దొరికాడండీ! 19 బంతుల్లో 50 కొట్టేశాడు!

IND vs AUS 3rd T20: ఈ గ్రీన్‌ ఎక్కడ దొరికాడండీ! 19 బంతుల్లో 50 కొట్టేశాడు!

Daughters Day 2022: సారాకు సచిన్ శుభాకాంక్షలు, వైరల్ గా మారిన పోస్ట్

Daughters Day 2022: సారాకు సచిన్ శుభాకాంక్షలు, వైరల్ గా మారిన పోస్ట్

IND vs AUS 3rd T20: పంత్‌కు నో ప్లేస్‌ - హైదరాబాద్‌లో టాస్‌ ఎవరు గెలిచారంటే?

IND vs AUS 3rd T20: పంత్‌కు నో ప్లేస్‌ - హైదరాబాద్‌లో టాస్‌ ఎవరు గెలిచారంటే?

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి