అన్వేషించండి

Sunil Gavaskar - Virat Kohli: కోహ్లీని ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు 20 నిమిషాలు చాలు!! నన్ను కలిస్తేనే..!

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) అండగా నిలిచారు. అతడికి తాను సాయం చేయగలనని పేర్కొన్నారు.

Sunil Gavaskar - Virat Kohli: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి (Virat Kohli) క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) అండగా నిలిచారు. అతడికి తాను సాయం చేయగలనని పేర్కొన్నారు. కనీసం 20 నిమిషాలు మాట్లాడితే కొన్ని సలహాలు ఇస్తానని వెల్లడించారు.

'విరాట్‌ కోహ్లీ 20 నిమిషాలు నన్ను కలిస్తే కొన్ని విషయాలు చెబుతాను. అవి అతడికి సాయపడొచ్చు. గ్యారంటీ ఇవ్వలేను గానీ చాలావరకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆఫ్‌ స్టంప్‌ లైన్‌కు సంబంధించి చర్చించాలి. కొన్నేళ్ల పాటు ఓపెనర్‌గా ఇదే ఆఫ్‌స్టంప్‌ లైన్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దీన్నుంచి బయటపడేందుకు కొత్తగా ప్రయత్నించాలి. అందుకే అతడు నన్ను కలిస్తే ఇవన్నీ చెబుతాను' అని గావస్కర్‌ అన్నారు.

పరుగులు చేయాలన్న తాపత్రయంతో ప్రతి బంతినీ ఆడాలని బ్యాటర్లు భావిస్తారని సన్నీ తెలిపారు. చాన్నాళ్లు పరుగులు చేయకపోవడంతో విరాట్‌ సైతం ఇలాగే ఆలోచిస్తున్నాడని అంచనా వేశారు. ఇంగ్లాండ్‌ సిరీసులో అతడు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడని వివరించారు. ఎప్పట్లాగే ఒకే విధంగా ఔటయ్యాడని పేర్కొన్నారు.

'విరాట్‌ విషయంలో తొలి పొరపాటే చివరిది అవుతోంది. ఎందుకంటే అతడు ఎక్కువగా రన్స్‌ చేయడం లేదు. ఎక్కువ స్కోరు చేయాలన్న  తాపత్రయంలో ఆడకూడని బంతుల్నీ ఆడేస్తున్నాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో మాత్రం అతడు మంచి బంతులకే ఔటయ్యాడు. కోహ్లీ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో వేచి చూడాలి. అతడికి పొరపాట్లు చేసే హక్కుంది. 70 సెంచరీలు కొట్టిన అనుభవం అతడిది. అన్ని పరిస్థితుల్లో రాణించాడు' అని సన్నీ తెలిపారు.

'విరాట్‌ విషయంలో తొందరపడొద్దు. కొన్నాళ్లు ఓపికగా ఉండాలి. ఒక ఆటగాడు 32, 33 పరుగులకే ఔటవుతుంటూ భారత్‌లో అతడిపై త్వరగా ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. బాగా ఆడాలని పోరాడుతున్న సమయంలో జట్టు నుంచి బయటకు పంపిస్తుంటారు. అందుకే కోహ్లీ ఫామ్‌పై సహనంతో ఉండాలి. దేశానికి సేవ చేస్తున్న దిగ్గజాల వైఫల్యాలకు అనుమతి ఉంటుంది' అని సన్నీ పేర్కొన్నారు.

ఛేదనలో విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు హడలెత్తిపోయేవాళ్లు. అతడిని ఎలా ఔట్‌ చేయాలో అని సతమతం అయ్యేవాళ్లు. అతడికి బంతులేసేందుకు భయపడేవాళ్లు. అలాంటిది రెండున్నరేళ్లుగా విరాట్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అడపాదడపా హాఫ్‌ సెంచరీలు చేస్తున్నా, మిగతా క్రికెటర్లతో పోలిస్తే సగటు బాగున్నా. తన మునుపటి స్థాయి అందుకోవడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget