అన్వేషించండి

ఆ ప్రచారాన్ని ఆపేస్తారా ? భారతరత్న తిరిగి ఇస్తారా ? సచిన్ కు ఎమ్మెల్యే బచ్చుకాడు వార్నింగ్

ఆన్ లైన్ గేమింగ్ కు వ్యతిరేకంగా....ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

ఆన్ లైన్ గేమింగ్ కు వ్యతిరేకంగా....ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. మొన్న షారుక్ ఖాన్ ఇంటి ముందు నిరసనకు దిగితే...తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మహారాష్ట్రలోని ప్రహర్ జన్ శక్తి పార్టీ ఎమ్మెల్యే బాబురావు ఆలియాస్ బచ్చు కాడు...తన అనుచరులతో కలిసి సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసనకు దిగాడు. ఆన్ లైన్ గేమ్స్ కు సచిన్ ఎండార్స్ మెంట్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాటింగ్ టు బెట్టింగ్ బ్యానర్లు ప్రదర్శిస్తూ...టెండూల్కర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆన్ లైన్ గేమ్ ల ప్రచారం నుంచి వెంటనే వైదొలగాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు...బచ్చు కాడు, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకొని బాంద్రా స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా బచ్చు కాడు అనుచరులు తగ్గలేదు...బాంద్రా పోలీస్ స్టేషన్ లోనూ ఆందోళనకు దిగారు. 

టెండూల్కర్ కు 3వందల కోట్లు కావాలనుకుంటే...ఆన్ లైన్ గేమ్స్ కు ప్రచారం చేయవచ్చన్నాడు ఎమ్మెల్యే బచ్చుకాడు. ఎండార్స్ మెంట్లే కావాలనుకుంటే...కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారతరత్న అవార్డును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో బచ్చు కాడు...మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటికైనా ఆన్ లైన్ గేమ్స్ ప్రచారాన్ని మానుకోకపోతే...న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యే బచ్చు కాడు వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు సైతం...టెండూల్కర్ ఆన్ లైన్ గేమ్స్ ప్రచారంపై లేఖ రాశారు. డబ్బు కోసం ఆన్ లైన్ గేమింగ్ ను ఎండార్స్ మెంట్ల్ చేయాలనుకుంటే...వెంటనే భారతరత్నను తిరిగి ఇచ్చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటి ముందు...అన్ టచ్ యూత్ ఫౌండేషన్ ఆందోళనకు దిగింది.  ఏ23 అనే ఆన్ లైన్ రమ్మీ పోర్టల్ సంస్థ...షారుక్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఏ 23 గేమ్స  ప్లాట్ ఫామ్...షారుక్ ఖాన్ తో ప్రొమో షూట్ చేసి విడుదల చేసింది. చలో సాథ్ ఖేలో అంటూ షారుక్ ఖాన్  ప్రొమోలో చెప్పారు. ఆన్ గేమింగ్ ప్లాట్ ఫాంలకు షారుక్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంపై...అన్ టచ్ యూత్ ఫౌండేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ23, జంగ్లీ రమ్మీ, జుపీ లాంటి ఆన్ లైన్ గేమింగ్స్ యువతను పాడు చేస్తున్నాయని...అలాంటి వాటిని ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించారు.

సచిన్ టెండూల్కర్...24 ఏళ్లు సుదీర్ఘ కెరీర్ ఎన్నో అసాధారణమైన రికార్డులను నెలకొల్పాడు. స‌చిన్ టెండూల్క‌ర్  పేరు లేకుండా ఇండియ‌న్ క్రికెట్ ప్ర‌స్థానాన్ని, ఘ‌న‌త‌ల్ని చెప్ప‌లేము. సొగ‌సైన ఆట‌తీరుతో ఇండియ‌న్ టీమ్‌కు ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల్ని అందించాడు. దిగ్గ‌జ క్రికెట‌ర్లు సొంతం చేసుకోలేని ఎన్నో  రికార్డుల‌ను తన పేరుతో లిఖించుకున్నాడు. అంతర్జాతీయ  క్రికెట్‌లో వంద సెంచ‌రీలు సాధించిన ఏకైక బ్యాటర్ స‌చిన్ మాత్ర‌మే. టెస్టుల్లో 51 సెంచరీలు, వ‌న్డేల్లో 49 సెంచ‌రీల‌ను స‌చిన్ సాధించాడు. ఆస్ట్రేలియాపై 20 సెంచ‌రీలు చేసిన ఏకైక బ్యాటర్ స‌చిన్ ఒక్క‌డే. శ్రీలంక, ద‌క్షిణాఫ్రికాల‌పై ప‌దికిపైగా సెంచ‌రీలు సాధించాడు. ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌లో అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ఏకైన బ్యాటర్ కూడా మాస్టర్ బ్లాస్టరే. క్రికెట్ చరిత్రలో గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్లలో ఒకరుగా సచిన్ టెండుల్కర్ గుర్తింపు పొందారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. వన్డేల్లో 18,426 పరుగులు, టెస్ట్ మ్యాచ్‌లలో 15,921 పరుగులు సాధించాడు మాస్టర్ బ్లాస్టర్. తాను ఆడిన ఏకైక టీ20 మ్యాచ్‌లో సచిన్ 10 పరుగులు సాధించాడు.

టాప్ హెడ్ లైన్స్

Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Kavya Maran Wedding: అనిరుధ్‌తో కావ్య మారన్ మ్యారేజ్ పుకార్లకు చెక్‌! అసలు విషయం ఏంటంటే? 
అనిరుధ్‌తో కావ్య మారన్ మ్యారేజ్ పుకార్లకు చెక్‌! అసలు విషయం ఏంటంటే? 
Vaibhav Sooryavanshi T20 Series Debate: ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ తర్వాత మేల్కొన్న టీమిండియా..! వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై అసిస్టెంట్ కోచ్ సంచలన వ్యాఖ్యలు!
Neymar Donation: భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget