Tagenarine Chanderpaul: డబుల్ సెంచరీతో చెలరేగిన తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ - తండ్రితో కలిసి అరుదైన క్లబ్‌లోకి!
టెస్టుల్లో శివనారాయణ్ చందర్‌పాల్ కొడుకు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో ఒక రికార్డును సమం చేశారు.
Tagenarine Chanderpaul: బులవాయోలో వెస్టిండీస్, జింబాబ్వే మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ భారీ రికార్డు సృష్టించాడు. ఈ ఆటగాడు 465 బంతుల్లో తన మొట్టమొదటి టెస్టు డబుల్ సెంచరీని సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.
తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ వెస్టిండీస్ మాజీ వెటరన్ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ కుమారుడు. తద్వారా టెస్టు క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన రెండో తండ్రీకొడుకులుగా తేజ్‌నారాయణ్ చందర్‌పాల్, శివనారాయణ్ చందర్‌పాల్ నిలిచారు. పాకిస్తానీ ద్వయం హనీఫ్ మహమ్మద్ (తండ్రి), షోయబ్ మహమ్మద్ (కుమారుడు) మాత్రమే ఇప్పటివరకు ఈ రికార్డును సృష్టించారు.
తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ టెస్టు కెరీర్
ఇటీవలే తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఈ ఆటగాడి వయస్సు దాదాపు 26 సంవత్సరాలు. ప్రస్తుతం తన టెస్టు కెరీర్‌లో మూడో మ్యాచ్ ఆడుతున్నా డబుల్ సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు. ఇంతకుముందు తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 45, 51, 47, 17 పరుగులు చేశాడు. కానీ ఇప్పుడు ఈ ఆటగాడు తన మూడో టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీని సాధించాడు.
తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ తర్వాత కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ సెంచరీ
ఇది కాకుండా తన మొదటి సెంచరీనే డబుల్ సెంచరీగా మార్చిన పదో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌గా తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 447 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 207 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వెస్టిండీస్ జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ కూడా 182 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిగిలిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. కైల్ మేయర్స్ 20, రామన్ రైఫర్ 2, జెర్మైన్ బ్లాక్‌వుడ్ 5, రోస్టన్ చేజ్ 7, జాసన్ హోల్డర్ 11 పరుగులు మాత్రమే చేయగలిగారు. అదే సమయంలో జింబాబ్వే తరఫున బ్రెండన్ మవుటా ఐదు వికెట్లు పడగొట్టాడు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram