Sanket Sargar Wins Medal: సంకేత్ సంబరం! వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు సిల్వర్ పతకం
Sanket Sargar Wins Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం లభించింది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో సంకేత్ సర్గార్ రజత పతకం కైవసం చేసుకున్నాడు.
Sanket Sargar Wins Medal: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ పోటీల్లో తొలి పతకం అందుకుంది. వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహాదేవ్ సర్గార్ (SanketMahadev Sargar) రజత పతకం ముద్దాడాడు. 55 కిలోల విభాగంలో 248 కిలోలు ఎత్తి అద్భుతం చేశాడు. స్నాచ్‌లో 114 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కిలోలు ఎత్తాడు. ఆఖరి వరకు స్వర్ణం కోసం శ్రమించాడు. అతడి తండ్రి, సోదరి సైతం వెయిట్ లిఫ్టర్లే కావడం ప్రత్యేకం! కుటుంబ వారసత్వాన్ని అతడు ఘనంగా నిలబెట్టాడు.
మలేసియా ఆటగాడు అనిక్ కస్‌దాన్ (స్నాచ్‌లో 113, క్లీన్ అండ్ జర్క్‌లో 135) స్వర్ణం గెలిచాడు. సంకేత్ కన్నా కేవలం ఒక కిలో మాత్రమే ఎక్కువ ఎత్తాడు. శ్రీలంక వెయిట్ లిఫ్టర్ దిలంక యడగె (225 కిలోలు) కాంస్యం గెలిచాడు.
స్నాచ్ విభాగంలో సంకేత్ ఏ మాత్రం రిస్క్ తీసుకోలేదు. వరుసగా 107, 111, 113 కిలోలు ఎత్తాడు. అతడి ప్రధాన పోటీదారు అనిక్ కస్‌దాన్ తొలి అవకాశంలోనే 107 కిలోలు ఎత్తాడు. ఆ తర్వాత రెండు ఛాన్సుల్లో విఫలమయ్యాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటే 135 కిలోలు ఎత్తాడు. మొత్తం బరువును 248 కిలోలకు పెంచాడు. ఆ తర్వాత ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. మోచేతి బెణికింది. అయినా క్రీడాస్ఫూర్తితో మూడో లిఫ్ట్‌కు వచ్చి ఎక్కువ బరువు మోసేందుకు ప్రయత్నించి పూర్తి చేయలేకపోయాడు.
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలవాలని సంకేత్ కలగన్నాడు. మహారాష్ట్రలో పాన్ షాప్, ఫుడ్‌స్టాల్ నడుపుకుంటున్న తన తండ్రికి సాయపడాలని అనుకున్నాడు. 'నేను స్వర్ణం గెలిస్తే కచ్చితంగా గుర్తింపు లభిస్తుందని తెలుసు. నా తండ్రికి సాయపడాలన్నది నా కోరిక. ఆయన నాకు చేసిందానికి కృతజ్ఞతగా ఉండాలి' అని సంకేత్ మీడియాకు చెప్పాడు. కాగా ఈ ఏడాది మొదల్లో సర్గార్ 256 కిలోలు ఎత్తి కామన్వెల్త్, జాతీయ రికార్డులను బద్దలు కొట్టడం గమనార్హం. మోచేతి గాయం కాకుంటే బహుశా ఆ ప్రదర్శనను పునరావృతం చేసేవాడేమో!
🇮🇳 wins its 1️⃣st 🏅 at @birminghamcg22 🤩#SanketSargar in a smashing performance lifted a total of 248 Kg in 55kg Men’s 🏋️♀️ to clinch 🥈at #B2022
— SAI Media (@Media_SAI) July 30, 2022
Sanket topped Snatch with best lift of 113kg & lifted 135kg in C&J
Congratulations Champ!
Wish you a speedy recovery#Cheer4India pic.twitter.com/oDGLYxFGAA
#CommonwealthGames
— Pinkal Bhartiya (@pinkalbhartiya9) July 30, 2022
Day 2 : Well done sanket 🇮🇳 ✊#weightlifting
1st Attempt : 107 kg ✅
2nd Attempt : 111 kg ✅
3rd Attempt : 113 kg ✅#CommonwealthGames #CommonwealthGames22 #Birmingham2022 #BirminghamCommonwealthGames pic.twitter.com/sBzZgU3U2G