Team India: ప్రపంచకప్‌లో అతడే డేంజరస్ అన్న శాస్త్రి! ఆ కుర్రాడిని ఊహించగలరా!!
T20 WC 2022: ఆ యువ క్రికెటర్‌కు టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అండగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడెంతో కీలకం అవుతాడని పేర్కొన్నాడు.
Sanju Samson always threaten in Australia says Ravi Shastri backs him for T20 WC 2022 selection : యువ క్రికెటర్ సంజు శాంసన్ (Sanju Samson)కు టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అండగా నిలిచాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో అతడెంతో కీలకం అవుతాడని పేర్కొన్నాడు. అక్కడి బౌన్సీ పిచ్‌లు అతడి బ్యాటింగ్ శైలికి నప్పుతాయని వెల్లడించాడు. షార్ట్ పిచ్ బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపించే షాట్లు అతడి అమ్ముల పొదిలో ఉన్నాయని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు శాస్త్రి మీడియాతో మాట్లాడాడు.
View this post on Instagram
'ఇకపై టీమ్‌ఇండియా ఆడే టీ20 మ్యాచుల్లో షార్ట్‌పిచ్ బంతులు కీలకం అవుతాయి. జట్టు యాజమాన్యం కచ్చితంగా ఈ బలహీనతపై దృష్టి సారిస్తుంది. రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్‌కు కచ్చితంగా అవకాశాలు దొరుకుతాయి. ప్రపంచకప్ జరిగే ఆస్ట్రేలియా పిచ్‌లపై పేస్, బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కట్, పుల్ షాట్లు ఆడాల్సి వస్తుంది. అలాంటప్పుడు శాంసన్ ప్రమాదకర ఆటగాడిగా మారతాడు. రోహిత్ సేనలోని మిగతా వాళ్లతో పోలిస్తే అక్కడి పరిస్థితుల్లో మెరుగైన షాట్లు ఆడే సత్తా అతడి సొంతం' అని శాస్త్రి అన్నాడు.
ప్రపంచకప్ నేపథ్యంలో ఇకపై టీమ్‌ఇండియా తలపడే అన్ని టీ20 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఆడతారని రవిశాస్త్రి తెలిపాడు. గాయాల పాలవ్వడం వంటి అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప మిగతా మ్యాచులన్నీ ఆడతారని అంచనా వేశాడు.
View this post on Instagram