Sania Mirza Retires: సానియా మీర్జా- భారత మహిళల టెన్నిస్ లో ఈ 'తొలి' రికార్డులు ఆమెవే!
భారత టెన్నిస్ లో మహిళా క్రీడాకారిణులకు టార్చ్ బేరర్ గా నిలిచిన సానియా మీర్జా 2003లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో ట్రోఫీలు, మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు.
Sania Mirza Retires: సానియా మీర్జా... నిన్నటితో ఈ భారత క్రీడాకారిణి టెన్నిస్ ప్రయాణం ముగిసింది. దాదాపు 2 దశాబ్దాలుగా టెన్నిస్ లో భారత పేరును నిలబెట్టిన సానియా.. డబ్ల్యూటీఏ దుబాయ్ ఓపెన్ లో మొదటి రౌండ్ ఓటమితో తన టెన్నిస్ ప్రస్థానాన్ని ముగించింది. గతనెలలో ఆడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ తన చివరి గ్రాండ్ స్లామ్ అయిన చెప్పిన సానియా.. దుబాయ్ ఓపెన్ ఆడేసి అంతర్జాతీయ కెరీర్ ను ముగించింది.
డబ్ల్యూటీఏ దుబాయ్ ఓపెన్ లో మహిళల డబుల్స్ ఈవెెెంట్ లో సానియా మీర్జా- మాడిసస్ కీస్ జోడీ.. రష్యా జంట సామ్సోనోవా- వెరోనికా కుడెర్మెటోవా చేతిలో ఓటమి పాలైంది. దీంతో మొదటి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టింది. ఓటమితో తన టెన్నిస్ ప్రస్థానాన్ని ముగించింది. ఈ సందర్భంగా సానియా మీర్జా కెరీర్ లో ముఖ్యమైన 5 రికార్డుల గురించి తెలుసుకుందాం.
భారత టెన్నిస్ లో మహిళా క్రీడాకారిణులకు టార్చ్ బేరర్ గా నిలిచిన సానియా మీర్జా 2003లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో ట్రోఫీలు, మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు. మీర్జా రిటైర్ మెంట్ సందర్భంగా ఆమె సాధించిన ఘనతలను ఓసారి చూద్దాం.
Thank you ‘partner ‘ 😏 https://t.co/KEuSKTj54d
— Sania Mirza (@MirzaSania) February 22, 2023
తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా రికార్డు సృష్టించారు. రెండు దశాబ్దాల కెరీర్‌లో సానియా మీర్జా 6 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుంది. తోటి భారత టెన్నిస్ లెజెండ్ మహేష్ భూపతితో కలిసి తొలిసారిగా ఆమె చరిత్ర సృష్టించింది. వీరిద్దరూ 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నారు. దీంతో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్న మొదటి భారతీయ మహిళగా సానియా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2012లో భూపతితో కలిసి సానియా మీర్జా ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ ను గెలిచారు. 2014లో బ్రూనో సోరెస్‌తో జతకలిసిన సానియా యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె 2015లో వింబుల్డన్ ట్రోఫీ సాధించింది. అలాగే 2016లో మార్టినా హింగిస్ తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ ట్రోఫీని గెలుచుకుంది.
తొలి డబ్ల్యూటీఏ టైటిల్ విజేత
పోటీ టెన్నిస్‌లోకి ప్రవేశించిన తర్వాత 17 ఏళ్ల వయస్సులో సానియా మీర్జా 2004లో డబ్ల్యాటీఏ టైటిల్‌ను గెలుచుకున్నారు. తద్వారా ఈ టైటిల్ గెలిచిన మొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. తర్వాత 18 ఏళ్ల వయసులో అదే ఈవెంట్ లో సింగిల్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో డబ్ల్యూటీఏ సింగిల్స్ ఈవెంట్‌ను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా సానియా నిలిచింది.
ప్రపంచ నంబర్ 1గా నిలిచిన భారత తొలి టెన్నిస్ క్రీడాకారిణి
2015లో చార్లెస్టన్‌లో సానియా మీర్జా డబుల్స్ విజయం సాధించింది. తద్వారా సింగిల్స్ లేదా డబుల్స్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా సానియా నిలిచింది. ఆమె డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ గా 91 వారాలు నిలిచింది. సానియా కెరీర్ మొత్తంలో 43 డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది.
డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో టాప్ 30లో ప్రవేశించిన మొదటి భారత టెన్నిస్ ప్లేయర్
డబ్ల్యాటీఏ (WTA) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 30లోకి ప్రవేశించిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్ గా సానియా మీర్జా నిలిచింది. 2007లో ఆమె తన కెరీర్ లోనే అత్యుత్తమైన 27వ ర్యాంకును సాధించింది.
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో 4వ రౌండ్ కు చేరిన తొలి భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణి
2005లో సానియా మీర్జా యూఎస్ ఓపెన్ సింగిల్స్ లో నాలుగో రౌండ్ కు చేరుకుంది. దీనిద్వారా గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఈవెంట్ లో 4వ రౌండుకు చేరిన తొలి భారత మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.
అంతర్జాతీయ టెన్నిస్ కెరీర్ కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా ఇప్పుడు తన కెరీర్‌లో మరో అధ్యాయాన్ని ప్రారంభించనుంది. ఈ టెన్నిస్ లెజెండ్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమయ్యే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటార్‌గా వ్యవహరించనుంది.
Countless memories, one @MirzaSania! ✨#DDFTennis | #SaniaMirza | #ThankYouSania pic.twitter.com/ExBQV0j9EJ
— Olympic Khel (@OlympicKhel) February 21, 2023