By: ABP Desam | Updated at : 21 Feb 2023 09:31 PM (IST)
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా ( Image Source : Getty Images )
Sania Mirza Retires: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన కెరీర్ ను ఓటమితో ముగించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ ఈవెంట్ లో తొలి రౌండ్లోనే సానియా జోడీ ఓటమి పాలైంది. సానియా మిర్జా, మాడిసన్ కీస్ జోడీ డబ్ల్యూటీఏ దుబాయ్ ఈవెంట్లో తొలి రౌండ్ లో 4-6, 0-6 తేడాతో రష్యా జోడి వెరోనికా, లుడ్మిలా సాంసోనోవా చేతిలో ఓటమితో ఇంటి దారి పట్టారు. దాంతో ఓటమితోనే సానియా కెరీర్ ముగిసినట్లైంది.
సానియా మిర్జా 20 ఏళ్ల సుదీర్ఘ టెన్నిస్ ప్రస్థానం ముగిసింది. 6 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత అయిన సానియా డబ్ల్యూటీఏ దుబాయ్ టోర్నమెంట్ లో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్ తో జత కట్టింది. కెరీలో చివరి టోర్నీలో విజేతగా నిలవాలని భావించిన సానియాకు రష్యా జోడీ చెక్ పెట్టింది. తొలి రౌండ్లో 6-4 తో పోరాడినా, రెండో రౌండ్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది సానియా జోడీ. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సానియా మిర్జా తన కెరీర్ లో చివరి టోర్నీ డబ్ల్యూటీఏ దుబాయ్ టోర్నీ అని ప్రకటించింది. 36 ఏళ్ల సానియా 2003లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించింది. స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ భాగస్వామిగా మూడు మహిళల గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 6 గ్రాండ్ స్లామ్ ల విజేతగా నిలిచింది.
Indian tennis icon Sania Mirza ends her career with first round defeat at WTA Dubai event
— Press Trust of India (@PTI_News) February 21, 2023
ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్‌ను తన ఆఖరి గ్రాండ్‌స్లామ్ అని చెప్పిన సానియా మీర్జా... టైటిల్ కొట్టకుండానే వెనుదిరిగారు. ఎన్ని విజయాలు సాధించిన ఆఖరి విజయం సొంతమైతే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా. అలాంటి కిక్‌ను సానియా మీర్జా పొంద లేకపోయారు.
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ ఓటమి పాలయ్యారు. స్టెఫాని, మాతోస్ జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో 6-7, 2-6 తేడాతో ఓడిపోయిందీ జోడీ. ఆరంభం ధాటిగానే స్టార్ట్ చేసినా... మధ్యలో సానియాబోపన్న జోడీకి బ్రేక్ పడింది. అనవసరమైన తప్పిదాలు కారణంగా హోరాహోరీ పోరులో మొదటి సెట్‌ను చేజార్చుకుందీ జోడీ. రెండో సెట్‌లో మాత్రం ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో స్టెఫాని, మాతోస్ ఎదురు దాడి కొనసాగింది. దీంతో మ్యాచ్‌ను 6-7, 2-6తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
సానియా భావోద్వేగం...
One final embrace 🫂@MirzaSania has played her final match, wrapping up her career in Dubai!#DDFTennis pic.twitter.com/miVNQYJGMJ
— wta (@WTA) February 21, 2023
తర్వాత టైటిల్ ఇచ్చే సందర్భంగా మాట్లాడిన సానియా మీర్జా అందర్నీ ఏడిపించేశారు. తాను చాలా చిన్న వయసులోనే కేరీర్ స్టార్ట్ చేశానంటూ చెబుతూ... కంటతడి పెట్టుకున్నారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన మొదటి నుంచి తన గేమ్‌లో పార్టనర్‌గా ఉన్న బోపన్న చాలా మంచి మిత్రుడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా తన హోం గ్రౌండ్ లాంటిదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన వారందరి పేర్లు ప్రస్తావించి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో మరుపురాని అనుభూతులు ఇచ్చిన గ్రాండ్‌స్లామ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉందన్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు సానియా. అది చూసిన కుటుంబ సభ్యులు కూడా కంట నీరు పెట్టుకున్నారు.
Suryakumar Yadav: సూర్యకుమార్ 3 వన్డేల్లో 3 డక్స్! మర్చిపోతే మంచిదన్న సన్నీ!
IPL 2023: రెస్ట్ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్!
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు
అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!
IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!
Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి
KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?