RCB vs DC Score LIVE: ఆఖరి బంతికి సిక్సర్‌తో బెంగళూరును గెలిపించిన భరత్, ఏడు వికెట్లతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్ 2021 ఆఖరి లీగు మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరుకున్నాయి. పంత్ సేనపై గెలవాలని కోహ్లీసేన భావిస్తోంది.

Background
ఐపీఎల్ 2021 ఆఖరి లీగు మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఇప్పటికీ ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ చేరుకున్నాయి. పంత్ సేనపై గెలిచి రన్‌రేట్ మెరుగు పర్చుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ప్రస్తుతం దిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 13 మ్యాచుల్లో 10 గెలిచి 20 పాయింట్లతో ఉంది. ఆర్‌సీబీ ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచినా బెంగళూరు రెండో స్థానానికి చేరుకోవడం కష్టం. చెన్నై భారీ రన్‌రేట్‌తో ఉండటమే కారణం.
ఆఖరి బంతికి సిక్సర్‌తో బెంగళూరును గెలిపించిన భరత్, ఏడు వికెట్లతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీ
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్‌తో బెంగళూరు గెలిపించిన తెలుగు తేజం శ్రీకర్ భరత్(76). ఢిల్లీపై ఏడు వికెట్లతో బెంగళూరు విజయం
14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 96-3
బెంగళూరు 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ కూడా అవుటయ్యాడు. మ్యాక్స్‌వెల్(17), శ్రీకర్ భరత్(45) క్రీజులో ఉన్నారు.





















