Dinesh Karthik on Ravindra Jadeja: జడ్డూ చిన్న పిల్లాడేం కాదు! మిడిలార్డర్‌ కష్టాలు తీర్చేస్తాడు!!

కాలం గడిచే కొద్దీ జడ్డూ మరింత మెరుగ్గా ఆడుతున్నాడని డీకే తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడని పేర్కొన్నాడు.

FOLLOW US: 

టీమ్‌ఇండియా మిలార్డర్‌ ఇబ్బందులను రవీంద్ర జడేజా పరిష్కరించగలడని వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ అంటున్నాడు. అతడిలో బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నాడు. బాధ్యత లేకుండా ఆడేందుకు అతడేమీ చిన్నపిల్లాడు కాదని వెల్లడించాడు.

'జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడినిప్పుడు చాలా చక్కగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఐదో స్థానానికీ అతడు నప్పుతాడు. ఆడేటప్పుడు తెలివిని ఉపయోగిస్తున్నాడు. అతడెంత మాత్రం బాధ్యతారాహిత్యంగా ఆడే చిన్నపిల్లాడు కాదు' అని డీకే అంటున్నాడు.

కాలం గడిచే కొద్దీ జడ్డూ మరింత మెరుగ్గా ఆడుతున్నాడని డీకే తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడని పేర్కొన్నాడు. 'అతడు బ్యాటుతో మ్యాచులు గెలిపించే వీరుడిగా ఎదిగాడు. నిజం చెప్పాలంటే అతడి బ్యాటింగే అతడి బలం' అని డీకే వెల్లడించాడు.

ఎప్పటిలాగే టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ కష్టాలు వేధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసులో ఈ విషయం మరోసారి బయటపడింది. ఓపెనర్ల తర్వాత మరెవ్వరూ ఆడలేకపోయారు. మ్యాచులను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఆల్‌రౌండర్ల కొరత జట్టును వేధిస్తోందని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం అంగీకరించారు. హార్దిక్‌ పాండ్య తర్వాత జట్టుకు సమతూకం తీసుకొచ్చేవారు కనిపించడం లేదని పేర్కొన్నారు. అందుకే జడ్డూ బెస్టని డీకే అభిప్రాయం.

ప్రస్తుతం జడ్డూ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ ఇబ్బందులు ఉండటంతోనే అతడిని దక్షిణాఫ్రికా సిరీసుకు ఎంపిక చేయలేదు. కోలుకోవడంలో ఆఖరి దశలో ఉండటంతో వెస్టిండీస్‌ సిరీసుకూ ఎంపిక చేయలేదు. అతనెప్పుడొస్తాడా అని జట్టు యాజమాన్యం ఎదురు చూస్తోంది.

Also Read: Ravi shastri on Virat Kohli: విరాట్‌ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!

Also Read: IND vs WI: అనిల్‌ సర్‌ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్‌! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే

Published at : 27 Jan 2022 07:22 PM (IST) Tags: Team India dinesh karthik Ravindra Jadeja ODI Team India Middle Order

సంబంధిత కథనాలు

IND vs IRE 2nd T20: హుద్‌ హుద్‌ హుడా! ఐర్లాండ్‌కు మళ్లీ తుఫాన్‌ తెస్తాడా? వర్షమైతే రానుంది!

IND vs IRE 2nd T20: హుద్‌ హుద్‌ హుడా! ఐర్లాండ్‌కు మళ్లీ తుఫాన్‌ తెస్తాడా? వర్షమైతే రానుంది!

Rohit Sharma Health Update: డాడీకి కరోనా! నెల రోజులు బయటకు రాడు తెల్సా! సమైరా వైరల్‌ వీడియో!

Rohit Sharma Health Update: డాడీకి కరోనా! నెల రోజులు బయటకు రాడు తెల్సా! సమైరా వైరల్‌ వీడియో!

India vs Ireland 2nd T20 Live Streaming: రెండో టీ20 వేదిక ఏంటి? మ్యాచ్‌ ఎన్ని గంటలకు? మార్పులేంటి?

India vs Ireland 2nd T20 Live Streaming: రెండో టీ20 వేదిక ఏంటి? మ్యాచ్‌ ఎన్ని గంటలకు? మార్పులేంటి?

Mayank Agarwal: ఇంగ్లండ్ టెస్టుకు రోహిత్ స్థానంలో మయాంక్ - కెప్టెన్సీ బాధ్యతలు ఎవరిని వరించేనో!

Mayank Agarwal: ఇంగ్లండ్ టెస్టుకు రోహిత్ స్థానంలో మయాంక్ - కెప్టెన్సీ బాధ్యతలు ఎవరిని వరించేనో!

IndW vs SLW, 3rd T20I: అదరగొట్టిన అటపట్టు - మహిళల టీ20లో టీమిండియాపై లంక గెలుపు - కానీ సిరీస్ మనదే!

IndW vs SLW, 3rd T20I: అదరగొట్టిన అటపట్టు - మహిళల టీ20లో టీమిండియాపై లంక గెలుపు - కానీ సిరీస్ మనదే!

టాప్ స్టోరీస్

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Telangana SSC Exam Results: గురువారం తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

Janasena Janavani  :

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Privatisation of PSU Banks: బ్యాంకుల ప్రైవేటీకరణ! పార్లమెంటులో కొత్త బిల్లు పెట్టనున్న కేంద్రం

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్

Optical Illusion: ఈ బొమ్మలో ఒక జంతువు దాక్కొని ఉంది, 30 సెకన్లలో దాన్ని కనిపెడితే మీ కంటి చూపు భేష్