Saketh Myneni Pair Into Final: తెలుగు ప్లేయర్ సాకేత్ జోడీ సంచలనం.. టాప్ సీడ్ ను ఓడించి, ఫైనల్ కి చేరిక, చెన్నై ఓపెన్ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీ
ఫైనల్లో జపాన్ కు చెందిన షింటారో మోచిజుకి- కైటో ఊసుగి జంటతో సాకేత్ ద్వయం తలపడనుంది. సెమీస్ లో భారత్ కే చెందిన రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్-విజయ్ సుందర్ ప్రశాంత్ జోడీపై విజయం సాధించింది.

Tennis News: తెలుగు ప్లేయర్ సాకేత్ మైనేని-రామ్ కుమార్ రామ్ నాథన్ జంట చెన్నై ఓపెన్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ సెమీఫైనల్లో సంచలనం నమోదు చేసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ లో టాప్ సీడ్ జంటను వరుస సెట్లలో ఓడించింది. వరుస సెట్లలో వారిని మట్టి కరిపించిన సాకేత్ జంట, తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్ లో డిఫెండింగ్ చాంపియన్ సాకేత్ జంట 7-6 (5), 7-6(8)తో రే హో (చైనీస్ తైపీ), మథ్యూ క్రిస్టోఫర్ ను కంగుతినిపించింది. రెండు సెట్లను టై బ్రేక్ లోనే గెలుచుకోవడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో సాకేత్ జంట కీలకదశలో సత్తా చాటిన మూడో సీడ్ సాకేత్ జంట ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక ఫైనల్లో జపాన్ కు చెందిన షింటారో మోచిజుకి- కైటో ఊసుగి జంటతో సాకేత్ ద్వయం తలపడనుంది. సెమీస్ లో భారత్ కే చెందిన రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్-విజయ్ సుందర్ ప్రశాంత్ జోడీపై 4-6, 6-4, 10-6తో విజయం సాధించింది.
🏆 Doubles Final at the ATP Chennai Challenger!
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) February 8, 2025
🇮🇳Saketh Myneni/Ramkumar Ramanathan vs 🇯🇵Shintaro Mochizuki/Kaito Uesugi
🕓 Time: 4 PM
📍 Venue: SDAT Tennis Stadium, Chennai
🎟️ Entry: FREE
Come cheer for the Indian duo in the big finale! 🇮🇳🎾 pic.twitter.com/Nx3E46Uc40
సింగిల్స్ లో టాప్ సీడ్ ముందంజ..
పురుషుల సింగిల్స్ లో సంచలనాలు ఏమీ నమోదు కాలేదు. టాప్ సీడ్ బ్రిటన్ కు చెందిన బిల్లీ హారీస్ 6-3, 7-6తో కజకిస్థాన్ కు చెందిన తిమోఫీ స్కాటోవ్ పై ఘన విజయం సాధించాడు. స్థాయికి తగ్గట్లు బిల్లీ.. వరుస సెట్లలో తిమోఫీపై గెలుపొందడం విశేషం. రెండో సీడ్ లో తిమోపీ కాస్త ప్రతిఘటన కనబర్చినా, తన అనుభవన్నాంత రంగరించిన బిల్లీ.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. 10, 12వ గేమ్ ల్లో మ్యాచ్ పాయింట్లను కాచుకున్న తిమోఫీ.. ఆఖర్లో మాత్రం చేతులెత్తేశాడు. సుమారు రెండున్నర గంటలపాటు హోరాహోరీగా ఈ మ్యాచ్ నడిచింది. ఇక సెమీస్ లో స్వీడన్ కు చెందిన ఎలియాస్ వైమర్ ను ఢీకొంటాడు. క్వార్టర్స్ లో వైమర్ 6-2, 6-3తో జపాన్ కు చెందిన రియో నోగుచిపై సునాయస విజయం సాధించాడు.
మరో సెమీస్ లో..
మరో సెమీస్లో చెక్ రిపబ్లిక్ కు చెందిన దాలిబర్ సివిర్సినాతో ఫ్రాన్స్ కి చెంిన కిరియన్ జాకెట్ తలపడనున్నారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ లో సివిర్సినా 6-3, 6-0తో ఉక్రెయిన్ కు చెందిన ఒలెక్సాండర్ ఓవ్చారెంకోపై అలవోక విజయం సాధించాడు. ఇక జాకెట్ మాత్రం క్వార్టర్సలో కాస్త చెమటోడ్చాడు. ఐదో సీడ్ షింటారో మోచిజుకితో జరిగిన మ్యాచ్ లో 6-1, 4-6, 7-6తో కష్టపడి విజయం సాధించాడు.






















