అన్వేషించండి

Sindhu wins Swiss Open: సింధు ఖాతాలో మరో టోర్నీ, స్విస్ ఓపెన్ ఫైనల్ లో ఘనవిజయం

Sindhu wins Swiss Open: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గెలుచుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ లో థాయ్ క్రీడాకారిణిపై విజయం సాధించింది.

Sindhu wins Swiss Open: భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(PV Sindhu) స్విస్ ఓపెన్ బ్యాడ్మింట‌న్(Swiss Open Badminton) టోర్నీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ లో థాయ్ లాండ్(Thailand) ఫ్లేయర్ బుసానన్ పై ఘన విజయం సాధించింది. ఫైనల్ లో 21-16, 21-8 తేడాతో పీవీ సింధు గెలుపొందింది. ఇటీవల జర్మన్​ ఓపెన్(German Open)​, ఆల్ ​ఇంగ్లాండ్​ ఓపెన్ ​లో ఓడిన పీవీ సింధు తాజాగా స్విస్​ ఓపెన్ ​లో తిరుగులేని విజయాలు సాధించింది. ఇవాళ్టి ఫైనల్​లో బుసానన్‌పై 21-16, 21-8తేడాతో సింధు విజయం సాధించి టైటిల్ ​ను గెలుచుకుంది. 49 నిమిషాల పాటు సాగిన మ్యాచ్ లో సింధు ఆధిపత్యం చేలాయించింది. దీంతో ఈ ఏడాది సింధు ఖాతాలో రెండు టైటిల్స్​ చేరాయి. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు గెలుచుకుంది. ఈ విజయంతో సింధు థాయ్ ప్లేయర్‌పై 16-1తో హెడ్-టు-హెడ్ రికార్డును సొంతం చేసుకుంది. 

Also Read : IPL 2022: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డ్ - వయసు అయిపోయింది అనేవాళ్లు ఇది తెలుసుకోండి

తొలి గేమ్ నెక్-టు-నెక్ ఫైట్ 

తొలి గేమ్‌లో 3-0తో ఆధిక్యంలో నిలిచిన సింధు ఫైనల్‌లో శుభారంభం చేసింది. కానీ థాయ్ షట్లర్ 3-3తో గేమ్‌ను సమం చేసింది. మొదటి గేమ్ హోరాహోరీగా సాగింది. 9-9 స్కోరుతో సమానంగా ఉన్న సమయంలో ప్రత్యర్థిని బోల్తా కొట్టించి రెండు పాయింట్లు సాధించింది దీంతో మొదటి విరామానికి 11-9 ఆధిక్యాన్ని సాధించింది. తర్వాత 16-15తో ఇరువురి మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. కానీ సింధు ఆ తర్వాత తన అనుభవంతో మొదటి గేమ్‌ను చేజిక్కించుకోవడానికి ఆరు పాయింట్లలో చివరి ఐదు పాయింట్లను గెలుచుకుంది. మిడ్-గేమ్ విరామానికి తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. రెండో గేమ్‌ను 21-8తో సింధు సునాయాసంగా గెలుచుకుంది. 

Also Read : IND W vs SA W: డూ ఆర్‌ డై మ్యాచు: చిన్న మిస్టేక్‌తో సెమీస్‌కు దూరమైన మిథాలీ సేన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget