అన్వేషించండి

Brand value of Olympians : క్రికెటర్లకే కాదు ఒలింపియన్లకు కాసుల వర్షమే - నీరజ్, మనుబాకర్ బ్రాండ్ వాల్యూ ఎంత పెరిగిందో తెలుసా ?

India Sports : భారత్‌లో ఆటగాళ్లలో బ్రాండ్ వాల్యూ అంటే క్రికెటర్లకే ఉంటుంది. కానీ ఇప్పుడు క్రమంగా పరిస్థితి మారుతోంది. ఒలింపియన్లకూ మంచి బ్రాండ్ వాల్యూ ఏర్పడుతోంది.

Neeraj Chopra  Manu Bhaker brand value jumps : క్రికెట్‌లో ఎవరైనా ఒక సెంచరీ లేదా.. ఓ కీలకమైన మ్యాచ్‌లో మ్యాన్ విన్నర్‌ పర్‌ఫార్మెన్స్ ప్రదర్శించారంటే.. ఆ క్రికెటర్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆటలో కాదు.. బయట ప్రకటనల పరంగా వందల కోట్ల ఆదాయం వచ్చి పడుతుంది. ఆ క్రికెటర్లతో ప్రకటనలు రూపొందించుకుని వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీలు పోటీ పడతాయి. అందుకే దేశంలో క్రికెట్ తప్ప ఇతర ఆటలు ఎదగడం లేదని.. డబ్బులు ఎక్కువగా వస్తాయి కాబట్టి.. కెరీర్ ను క్రికెట్ లోనే క్రీడాకారులు చూసుకుంటున్నారని విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తకఏ క్రీడలో అయినా సరే మంచి  ప్రతిభ చూపిస్తే అందరికీ బ్రాండ్ వాల్యూ ఏర్పడుతుందని తాజాగా తేలింది. 

నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ రూ. 330 కోట్ల పైనే ! 

ఒలిపింక్స్ తర్వాత భారత అద్లెట్ల బ్రాండ్ వాల్యూ రాకెట్ స్పీడ్‌తో పెరిగిందని తాజా అధ్యయనంలో తేలింది. ఇటీవలి ఒలింపిక్స్‌లో రజతం.. అంతకు ముందు స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. క్రికెటేతర ఆటగాళ్లలో అత్యంత ఎక్కువ బ్రాండ్ వాల్యూ కలిగిన ప్లేయర్ గా నిలిచారు. నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 40 మిలియన్ డాలర్లకు అంటే 330  కోట్ల రూపాయలకు చేరుకుందని తేలింది. ఒలిపింక్స్‌కు ముందు ఇది 29.6 మిలియన్ డాలర్లుగా ఉంది. గతంలో హార్దిక్ పాండ్యాతో  పోటీగా బ్రాండ్ వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఆయనను కూడా దాటేసి ఖరీదైన ప్లేయర్ గా మారారు. ఒక్కో బ్రాండ్‌ ప్రమోషన్‌కు నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల వరకూ నీరజ్ చోప్రా వసూలు చేస్తున్నారు. 

ఒక్క యాడ్‌కూ రూ. కోటిన్నర చార్జ్ చేస్తున్న మను  బాకర్                           

ఇక ఈ ఒలింపిక్స్ తర్వాత  బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయిన ప్లేయర్ గాష షూటర్ మనుబాకర్ నిలిచారు. గతంలో స్సాన్సర్ల కోసం ఆమె వెదుక్కోవాల్సి వచ్చేది. ఒక్కో  బ్రాండ్‌కు పాతిక లక్షలు వస్తే గొప్పగా ఉండేది.  కానీ రెండు మెడల్స్ గెలిచిన తర్వాత ఒక్కో యాడ్‌కు రూ. కోటిన్నర వరకూ చార్జ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని నలభై కంపెనీలు సంప్రదించినట్లుగా తెలుస్తోంది. 

మూడింతలు పెరిగిన వినేశ్ ఫోగట్ బ్రాండ్ వాల్యూ 

ఇక పతకం గెలవకపోయినా  మనసులు గెలిచిన వినేష్ ఫోగట్ బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె  బ్రాండ్ వాల్యూ ఒక్క సారిగా మూడు వందల శాతం పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఒక్క ఉత్పత్తిని ప్రమోట్ చేయడానికి రూ. పాతిక లక్షలు చార్జ్ చేసేవారు. కానీ ఇప్పుడు అది రూ. కోటికి చేరినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. క్రికెటేతర ఆటల్లోనూ పెద్ద ఎత్తున ఆటగాళ్లకు బ్రాండ్ వాల్యూ ఏర్పడితే ఇతర ఆటలకూ మన దేశంలో ఆదరణ పెరుగుతుందని అనుకోవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
US Fed Rates Cut: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది?
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Embed widget