అన్వేషించండి

Paris Olympics: నేటి నుంచే విశ్వ క్రీడల కౌంట్‌డౌన్‌ , ఒలింపియాలో కీలక ఘట్టం

Paris Olympics: మరో 100 రోజుల్లో పారిస్‌లో విశ్వ క్రీడా సంరంభానికి తెరలేవనున్న వేళ సంప్రదాయం ప్రకారం ఒలింపిక్స్‌ పుట్టిన ఒలింపియాలో నేడు జ్యోతి ప్రజ్వలన జరగనుంది.

Paris Olympics  opening ceremony : ఒలింపిక్స్‌ క్రీడల(Paris Olympics) ఆరంభోత్సవానికి సమయం సమీపిస్తున్న వేళ నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరో 100 రోజుల్లో పారిస్‌లో విశ్వ క్రీడా సంరంభానికి తెరలేవనున్న వేళ సంప్రదాయం ప్రకారం ఒలింపిక్స్‌ పుట్టిన ఒలింపియాలో నేడు జ్యోతి ప్రజ్వలన జరగనుంది. ఈ జ్యోతి ప్రజ్వలనతో ఒలింపిక్స్‌ క్రీడల కౌంట్‌ డౌన్‌ ఆరంభం కానుంది. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 100 రోజుల కౌంట్‌డౌన్‌కు కూడా పారిస్‌ సిద్ధమవుతోంది. బుధవారం నుంచి క్రీడల ఆరంభోత్సవానికి 100 రోజుల సమయం ఉంది. ఈ క్రీడల నిర్వహణ కోసం ఫ్రాన్స్‌ దాదాపు రూ.79,897 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇక్కడ వెలిగించిన టార్చ్‌ను పారిస్‌ క్రీడల నిర్వాహకులకు అందజేస్తారు. గ్రీస్‌లో 11 రోజులపాటు టార్చ్‌ రిలేను నిర్వహించిన అనంతరం.. ఈనెల 27న ఒలింపిక్‌ జ్యోతి పడవలో విశ్వక్రీడల వేదికైన పారిస్‌కు పయనం అవుతుంది. 
 
తొలిసారి ఆరుబయట
అయితే ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవాన్ని స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సిద్ధమైంది. ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్‌ నది ఈ వేడుకలకు వేదిక కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నదిలో 6 కిలోమీటర్ల దూరం పాటు సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్‌ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలని అనుకున్నారు. 
 
సరికొత్త సాంప్రదాయం
వరల్డ్‌ అథ్లెటిక్స్‌(World Athletics) సరికొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌(Olympic) అథ్లెటిక్స్‌(Athletes)లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో పసిడి పతకాలు గెలిచే వారికి ప్రైజ్‌మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. 2024 ఒలింపిక్స్‌లో భాగంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగాల్లో పోటీపడి స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమానం కింద 50 వేల యూఎస్‌ డాలర్లు భారత కరెన్సీలో రూ.41.60 లక్షలు అందించేందుకు సిద్ధమైంది. ఇలా నగదు బహుమానాన్ని ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ(WA) నిలిచింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రోత్సాహకాలు అందించేందుకు గాను 2.4 మిలియన్ల యూఎస్‌ డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేసినట్టు తెలిపింది. 2028 లాస్‌ ఎంజేల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget