అన్వేషించండి
Advertisement
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే, మనూ బాకర్ పతక పోరు నేడే
Olympic Games Paris 2024: పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఇప్పుడు మను భాకర్ మరోసారిసారి పతక పోరులో నిలచింది.
India's schedule today: ఒలింపిక్స్(Paris olympics 2024) లో తొలి పతకం సాధించిన స్టార్ షూటర్ మనూ బాకర్(Manu bhakar) రెండో పతకంపై కన్నేసింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరుకు సరబ్‌జోత్‌తో కలిసి సిద్ధమైంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో మూడో స్థానంలో నిలిచిన ఈ జోడీ ఇప్పుడు కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని భారత్‌కు మరో పతకం అందించాలన్న పట్టుదలతో ఉంది. షూటింగ్‌లో రెండో పతకం గెలిచి చరిత్ర సృష్టించాలని మనూబాకర్ భావిస్తోంది. కొరియా షూటర్లతో భారత జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. క్వాలిఫికేషన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన కొరియా షూటర్లపై భారత జోడీదే కాస్త పైచేయి కనిపిస్తుండడంతో పతకం ఖాయమనే అభిమానులు భావిస్తున్నారు. అయితే ఒత్తిడిని తట్టుకుని భారత షూటర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారన్న దానిపైనే పతక ఆశలు ఆధారపడి ఉన్నాయి. నిన్న అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌ను చివరి నిమిషంలో డ్రాగా ముగించిన భారత జట్టు ఇవాళ ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత బాక్సర్ అమిత్ పంగాల్ ప్రి క్వార్టర్ మ్యాచ్ కూడా నేడే జరగనుంది.
పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా నేడే జరగనుంది. సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమదైన రోజున ఎంతటి బలమైన జంటనైనా ఓడించే సత్తా ఉన్నా ఈ జోడీ ఈసారి పతకం తప్పక సాధిస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్‌కు చేరనుండడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.
ఇవాళ్టీ భారత షెడ్యూల్
మెడల్ ఈవెంట్స్
షూటింగ్
ట్రాప్ పురుషుల అర్హత పోటీలు (పృథ్వీరాజ్)- మధ్యాహ్నం 12.30
10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పోరు (మను-సరబ్‌జోత్ × లీ-యెజిన్)- మధ్యాహ్నం 1 గంటలకు
షూటింగ్
ట్రాప్ మహిళల క్వాలిఫికేషన్ (శ్రేయసి, రాజేశ్వరి)- మధ్యాహ్నం 12.30
రోయింగ్
మెన్ సింగిల్ స్కల్స్ క్వార్టర్స్ (బాల్‌రాజ్)- మధ్యాహ్నం 1 గంటలకు
బ్యాడ్మింటన్
మెన్స్ డబుల్స్ (సాత్విక్-చిరాగ్ × అల్ఫియాన్-అర్డియాంతో)- సా।। 5.30 గంటలకు
ఉమెన్స్ డబుల్స్ (అశ్విని-తనీషా × మపాస-యు)- సా।। 6.20 గంటలకు
బాక్సింగ్
మెన్స్ 51 కేజీల ప్రి క్వార్టర్స్ (అమిత్ × పాట్రిక్)- రాత్రి 7.16
మహిళల 57 కేజీల తొలి రౌండ్ (జాస్మిన్ × పెటిసియో)- రాత్రి 9.24
మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్ (ప్రీతి × మార్సెలా)- రాత్రి 1.06
ఈక్వెస్ట్రియన్
డ్రెసెజ్ వ్యక్తిగత గ్రాండ్ ప్రి (అనూష్)- మధ్యాహ్నం 2.30
హాకీ
భారత్ × ఐర్లాండ్- సా।। 4.45
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత విభాగం (అంకిత, భజన్)- సాయంత్రం 5.14
పురుషుల వ్యక్తిగత విభాగం (ధీరజ్ × ఆడమ్)- రాత్రి 10.46
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
కరీంనగర్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement