News
News
X

Mirabai Chanu : మీరాబాయి చానును సర్‌ప్రైజ్‌చేసిన మణిపూర్ ప్రభుత్వం

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి స్వదేశానికి వచ్చిన మీరాబాయి చానుకు మణిపూర్ ప్రభుత్వం.. అన్నట్టుగానే సర్‌ప్రైజ్ చేసింది.

FOLLOW US: 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిపతకం అందించిన వెయిట్‌ లిఫ్టర్ మీరాబాయికి గ్రాండ్ వెల్‌కం చెప్పారు అభిమానులు. సోమవారం స్వదేశానికి చేరుకున్నారామె. దిల్లీ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన ఆమెపై పూలవర్షం కురిపించారు ఫ్యాన్స్. ఇండియా.. ఇండియా... భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. అభిమానుల సందడితో ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. ప్రాంగణం మొత్తం నినాదాలతో హెరెత్తిపోయింది. 

టోక్యో నుంచి దిల్లీ చేరుకున్న మీరాబాయి చానుకు... ఎయిర్‌పోర్టులోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. దిల్లీలో దిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన మీరాబాయి... 2016లో పతకం చేజారినప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టు తెలిపారు. ఐదేళ్ల పాటు చాలా కఠినమైన సాధన చేశానని.. శిక్షణ విధానం కూడా మారిందని... ఇప్పటి విజయానికి అదే కారణమని వ్యాఖ్యానించారు. 
తనకు మద్దతుగా నిలించి ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రజలందరికీ మీరాబాయి కృతజ్ఞతలు చెప్పారు.  ఎన్నో త్యాగాలు చేశానని... ఆ త్యాగాల ఫలితమే సిల్వర్ మెడల్ అని చూపిస్తూ భావోద్వేగానికి గురయ్యారు మీరాబాయి. 

టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్ సాధించిన మీరాబాయిని మణిపూర్ ప్రభుత్వం  తగిన గౌరవం కల్పించింది. గుర్తింపు కల్పించింది. పోలీస్‌ శాఖలో ఉన్నతోద్యోగిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మీరాను అదనపు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం. రజతం సాధించిన రోజే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోటి రూపాయల రివార్డును మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ ప్రకటించారు. ఆమె వచ్చే సరికి మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తామని అప్పుడే చెప్పారు. ఆమె స్వదేశానికి వచ్చే నాటికి పోలీసు ఉద్యోగిగా నియమిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మీరాబాయి చాను రైల్వే ఉద్యోగిగా ఉన్నారు. రైల్వే శాఖలో ప్రస్తుతం టీసీగా పని చేస్తున్నారు. 

మణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను ఒలింపిక్స్‌ పోటీల్లో 49 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచి సత్తా చాటింది. ఆమె గెలుపుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌ ప్రభుత్వం ఆమెకు రూ.కోటి నగదు బహుమతితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. 8 మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది.

జూడో క్రీడాకారిణి లిక్మాబమ్ సుశీల దేవిని కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోట్ చేయనున్నట్టు చెప్పారు మణిపూర్ సీఎం. ఒలిపింక్స్‌లో ఆమె పాల్గొన్నందుకు 25 లక్షల రూపాయాల రివార్డు కూడా ఇవ్వబోతున్నట్టు ఇవ్వనున్నట్టు తెలిపారు. 

Published at : 26 Jul 2021 08:46 PM (IST) Tags: olympics news Mirabai Chanu Olympics 2021 update Olympics 2021 news Olympics medal India in Olympics

సంబంధిత కథనాలు

200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?

200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?

Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం

Jammu Kashmir Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్- ఓ ఉగ్రవాది హతం

Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

Prashant Kishor on Congress: కాంగ్రెస్ సమావేశాలతో అణా పైసా లాభం లేదు- అడిగారు కాబట్టి చెబుతున్నా: పీకే

Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..

Neeraj Chopra: నీటిలోనూ నీరజ్ కు అదే ఆలోచన.. స్కూబా డైవ్ చేస్తూ.. జావెలిన్ విసిరాడిలా..

PM Narendra Modi: పారాలింపిక్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ చిట్ చాట్

PM Narendra Modi: పారాలింపిక్ ఛాంపియన్లతో ప్రధాని మోదీ చిట్ చాట్

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్