Neeraj Chopra : NC క్లాసిక్ 2025లో స్వర్ణం గెలుచుకున్న నీరజ్ చోప్రా - 86.18 మీటర్ల త్రోతో గోల్డ్
Neeraj Chopra : నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. తన పేరిటో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అథ్లెట్ ఈవెంట్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు.

Neeraj Chopra : బెంగళూరు(Bengaluru)లో తొలిసారిగా నిర్వహిస్తున్న నీరజ్ చోప్రా క్లాసిక్ 2025(NC Classic 2025 ) శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. తొలి ఎడిషన్‌లోనే నీరజ్ చోప్రా స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ విజయంతో నీరజ్ మరో ఘనత సాధించాడు.
భారత్‌లోనే ఇలా ఒక అథ్లెట్ పేరు మీద అంతర్జాతీయ టోర్నీ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు స్వీడిష్ పోల్ వాల్ట్ స్టార్ మోండో డుప్లాంటిస్, కెన్యా పరుగుల వీరుడు కిప్‌చోగే కీనో విషయంలోనే ఇలాంటివి చూశాం. ఇప్పుడు నీరజ్ పేరు మీద కూడా అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. అందుకే దీనికి ాలా ప్రాధాన్యత ఏర్పడింది.
హర్యానాలోని ఖంద్రా గ్రామానికి చెందిన 27ఏళ్ల నీరజ్ చోప్రా ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్‌లో పతకాలు సాధించి భారత్ పతాకాన్ని గర్వంగా ఎగరేశాడు. అందుకే నీరజ్ గ్రౌండ్‌లో దిగితే ఆయన కోసం అభిమానులు ఎగబడుతున్నారు. ఆయన సాధించిన విజయాలతో దిగ్గజ కంపెనీలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి.
బెంగళూరులో కూడా అదే కనిపించింది. ఆయన కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. ప్రతి త్తోను ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఆయన్ని మరింతగా ఉత్సాహపరించారు. దీన్ని మొదట పంచకుల వేదికగా నిర్వహించాలని భావించారు. కానీ అక్కడ లైటింగ్ సరిగా లేదనే కారణంతో వెన్యూను మార్చారు. అయినా సరే నీరజ్ ఆట ఎక్కడ ఆడినా సరే జనం మాత్రం తరలి వస్తున్నారు. పతకాలు కూడా ఆయన్ని వెతుక్కొని వస్తున్నారు. ఇసారి కూడా ఇది మరోసారి రుజువైంది.





















