News
News
వీడియోలు ఆటలు
X

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

యూపీ వారియర్జ్‌తో జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 72 పరుగులతో ఘనవిజయం సాధించింది.

FOLLOW US: 
Share:

Mumbai Indians Women vs UP Warriorz, Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 182 పరుగులు చేసింది. అనంతరం యూపీ వారియర్జ్ 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ముంబై 72 పరుగులతో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ముంబై ఇండియన్స్ తరఫున ఆల్ రౌండర్ నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. మహిళల ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో ఓడిన యూపీ ఇంటి బాట పట్టింది.

హ్యాట్రిక్‌తో చెలరేగిన ఇసీ
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కీలకమైన మ్యాచ్‌లో ఓపెనర్లు అలిస్సా హీలీ (11: 6 బంతుల్లో, రెండు ఫోర్లు), శ్వేతా సెహ్రావత్ (1: 8 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. టహ్లియా మెక్‌గ్రాత్ (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా త్వరగా అవుట్ కావడంతో యూపీ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే (43: 27 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు), గ్రేస్ హారిస్ (14: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వీరు జాగ్రత్తగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. నాలుగో వికెట్‌కు 35 పరుగులు జోడించిన అనంతరం గ్రేస్ హారిస్‌ను అవుట్ చేసి నాట్ స్కివర్ బ్రంట్ ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. అయినా మరోవైపు కిరణ్ జోరు ఏమాత్రం ఆగలేదు. ముంబై బౌలర్లపై ఎదురు దాడికి దిగి పరుగులు రాబడుతూనే ఉంది.

ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇసీ వాంగ్ యూపీని చావు దెబ్బ తీసింది. రెండో బంతికి వేగంగా ఆడుతున్న కిరణ్ నవ్‌గిరేను అవుట్ చేసిన ఇసీ, మూడో బంతికి సిమ్రన్ షేక్ (0: 1 బంతి), నాలుగో బంతికి సోఫీ ఎకిల్‌స్టోన్‌లను (0: 1 బంతి) క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ సాధించింది. దీంతో యూపీ 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత యూపీ లోయర్ ఆర్డర్‌ను ముంబై త్వరగా పెవిలియన్‌కు పంపేసింది. దీంతో యూపీ 17.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. ఇసీ వాంగ్ నాలుగు వికెట్లు తీసింది. సైకా ఇషాక్‌కు రెండు వికెట్లు దక్కాయి. నాట్ స్కివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, జింతిమణిలు ఒక్కో వికెట్ పడగొట్టారు.

నాట్ స్కివర్ షో
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ యాస్తిక భాటియా (21: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు) యూపీ బౌలర్లపై మొదటి బంతి నుంచి విరుచుకుపడింది. కానీ నాలుగో ఓవర్లో అంజలి శర్వాణి యాస్తికను అవుట్ చేసి యూపీకి మొదటి వికెట్ అందించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నాట్ స్కివర్ బ్రంట్ (72 నాటౌట్: 38 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడింది.

కాసేపటికి మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (26: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) అవుట్ అయింది. తన స్థానంలో వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (14: 15 బంతుల్లో, ఒక ఫోర్) కూడా కీలక మ్యాచ్‌లో ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. కానీ మరో ఎండ్‌లో నాట్ స్కివర్ బ్రంట్ మాత్రం ఊచ కోత ఆపలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ తర్వాత వచ్చిన మెలీ కెర్ (29: 19 బంతుల్లో, ఐదు ఫోర్లు) బ్రంట్‌కు చక్కని సహకారం అందించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. ఆఖర్లో మెలీ కెర్ అవుటైనా పూజా వస్త్రాకర్ (11 నాటౌట్: 4 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. పార్శవి చోప్రా, అంజలి శర్వాణిలకు చెరో వికెట్ దక్కాయి.

Published at : 24 Mar 2023 11:02 PM (IST) Tags: UP Warriorz Mumbai Indians Women WPL 2023 Eliminator MIW Vs UPW MIW Vs UPW Highlights MIW Vs UPW Match Highlights

సంబంధిత కథనాలు

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!

French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!

WTC Final 2023: చీటర్స్ చీటర్స్ అంటూ హోరెత్తుతున్న ఓవల్ - గిల్ వివాదాస్పద ఔట్‌పై ట్విటర్‌లో ఆగ్రహం

WTC Final 2023: చీటర్స్ చీటర్స్ అంటూ హోరెత్తుతున్న ఓవల్ - గిల్ వివాదాస్పద ఔట్‌పై ట్విటర్‌లో ఆగ్రహం

WTC Final 2023: హెడ్‌కోచ్‌గా ద్రావిడ్ జీరో- టీమిండియాను దేవుడే కాపాడాలి - పాక్ మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

WTC Final 2023: హెడ్‌కోచ్‌గా ద్రావిడ్ జీరో- టీమిండియాను దేవుడే కాపాడాలి - పాక్ మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్

Bumrah Comeback: బుమ్రా కమ్‌బ్యాక్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దినేశ్ కార్తీక్ - పేస్ గుర్రం ఎంట్రీ అప్పుడే!

Bumrah Comeback: బుమ్రా కమ్‌బ్యాక్‌పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన దినేశ్ కార్తీక్ - పేస్ గుర్రం ఎంట్రీ అప్పుడే!

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !