MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులకు పరిమితం అయింది.
![MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం! MIW Vs DCW, WPL 2023: Mumbai Indians Women Scored 109 Runs For 8 Wickets Against Delhi Capitals MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/fe151666bf1a94d2eeeea13d2f9780641679328152620252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mumbai Indians Women Vs Delhi Capitals Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తడబడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులకు పరిమితం అయింది. పూజా వస్త్రాకర్ (26: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఘోరమైన ప్రారంభం లభించింది. టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఓపెనర్లు యాస్తిక భాటియా (1: 6 బంతుల్లో), హేలీ మాథ్యూస్ (5: 10 బంతుల్లో, ఒక ఫోర్), నాట్ స్కీవర్ బ్రంట్ (0: 1 బంతి) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో ముంబై 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అమీలియా కెర్ (8: 16 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.
అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (23: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), పూజా వస్త్రాకర్ (26: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే పనిలో పడ్డారు. వీరు ఐదో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. కానీ పరుగుల వేగం పూర్తిగా మందగించింది. క్రీజులో కుదురుకున్న దశలో పూజా వస్త్రాకర్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరూ అవుటయ్యారు. తర్వాత వచ్చిన వారు వేగంగా ఆడలేకపోయారు. దీంతో ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులకే పరిమితం అయింది.
ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, పూజా వస్త్రాకర్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలిత, సైకా ఇషాక్
ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్ (ప్లేయింగ్ XI)
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్ కాప్, తానియా భాటియా (వికెట్ కీపర్), జెస్ జోనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్
Innings Break!
— Women's Premier League (WPL) (@wplt20) March 20, 2023
An impressive bowling performance from @DelhiCapitals restricts #MI to 109/8 in the first innings.
Can @mipaltan successfully defend this target❓
Scorecard ▶️ https://t.co/Gcv5Cq5nOi#TATAWPL | #MIvDC pic.twitter.com/uHB4tNaUi5
For her economical spell including 2⃣ wickets with the new ball, @kappie777 becomes our 🔝 performer from the first innings of the #MIvDC contest in the #TATAWPL
— Women's Premier League (WPL) (@wplt20) March 20, 2023
A look at the bowling summary 🔽 pic.twitter.com/WtwjOiI1Gh
.@JemiRodrigues with another catch! 👌#MI lose their skipper and are 6️⃣ down with 8️⃣5️⃣ on board
— Women's Premier League (WPL) (@wplt20) March 20, 2023
Follow the match ▶️ https://t.co/Gcv5Cq4PYK#TATAWPL | #MIvDC pic.twitter.com/3GV0VBPlkX
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)