News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Priyanka iyer : ప్రియాంక జవాల్కర్ - వెంకటేష్ అయ్యర్ కమాన్ గుస గుస

టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ మధ్య సమ్‌థింగ్..సమ్‌ధింగ్ ఉందా ? ఎందుకు ఆ డౌట్ నెటిజన్లకు వచ్చిందంటే ?

FOLLOW US: 
Share:

ప్రియాంకా జవాల్కర్ తెలుసా ? ఈ పేరు పెట్టి చెబితే గుర్తు పట్టడం చాలా కష్టం కాని విజయ్ దేవరకొండ టాక్సివాలా హీరోయిన్ అంటే మనలో చాలా మందికి లైట్ వెలుగుతుంది. ముద్గుగుమ్మే కానీ ఆ సినిమా సక్సెస్‌తో బ్రేక్ రాలేదు. పెద్దగా చాన్సులు రావట్లేదు. అలా అని నిరాశపడిపోదు ప్రియాంకా జవాల్కర్. ఎప్పటికప్పుడు ఫోటో షూట్లు చేసుకుని..వాటిని సోషల్ మీడియాలో పెట్టుకుని అభిమానుల దృష్టిలో పడుతూనే ఉంటుంది. ఆమె అందానికి ఫిదా అయిపోయి .. వేల మంది కామెంట్లు పెడుతూనే ఉంటారు. అయితే ఎవరికీ ఆమె రిప్లయ్ ఇవ్వదు. అలా ఇచ్చిందంటే సోషల్ మీడియా అంతా " కమాన్ గుస గుస" నే. ఇప్పుడు అదే జరుగుతోంది. 

భారత్ తరపున రెండు వన్డేలు, తొమ్మిది ట్వింటీలు ఆడిన యువ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ తరపున మ్యాచ్‌లు ఆడుతున్నారు. అయ్యర్ కూడా ప్రియాంకా ఇన్‌స్టాను ఫాలో అవుతున్నారు. తాజాగా ప్రియాంకా జవాల్కర్ తాను చేసిన ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఓ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. షరా మామూలుగా ఇన్‌స్టాలో కాచుకుని కూర్చున్నవారు తెగ లైకులు కొట్టారు. వారితో పాటు వెంకటేష్ అయ్యర్ కూడా.. స్పందించారు. క్యూట్ అని కామెంట్ పెట్టాడు. అంతే..  ప్రియాంకా జువాల్కర్ కూడా పులకరించిపోయారు. వెంటే.."  హు..? యు ? " అంటూ రిప్లయ్ ఇచ్చారు. అంటే అయ్యరే క్యూట్ అని ప్రియాంకా సిగ్గుపడ్డారన్నమాట. 

View this post on Instagram
 
A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

వారిద్దరి మధ్య ఆ రెండు వాక్యాల చాటింగే ఇన్‌స్టాలో జరిగినా...  ఇతరులు మాత్రం దానిపై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నారు. అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఇద్దరి మధ్య సమ్‌థింగ్.. సమ్ ధింగ్ అంటున్నారు. ఈ చాటింగ్ అయిన తర్వాత ప్రియాంకా జవాల్కర్ మరో రెండు ఫోటోలను కూడా పెట్టారు. అయ్యర్ స్పందన కోసం ప్రియాంక వాటిని పెట్టారని కామెంట్లు పెడుతున్నారు. ప్రియాంకా జవాల్కర్, వెంకటేష్ అయ్యర్ మధ్య పాత పరిచయాలు ఉన్నాయో లేవో కానీ....ఇప్పుడు సోషల్ మీడియాలో వీరి షార్ట్ చాటింగ్ వైరల్ అవుతోంది. 

Published at : 05 Apr 2022 03:46 PM (IST) Tags: Priyanka Jawalkar Venkatesh IYER Taxiwala Heroine Heroine Priyanka Jawalkar KKR Cricketer Iyer

ఇవి కూడా చూడండి

IND v AUS:  టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..

IND v AUS: టీం ఇండియా ఆనవాయతీ కొనసాగించిన స్కై , విన్నింగ్ ట్రోఫీ ఎవరికి ఇచ్చాడంటే..

Virat Kohli: కింగ్‌ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు

Virat Kohli: కింగ్‌ కోహ్లీ అంటే అట్లుంటది మరి, ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు

Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట

Ruturaj Gaikwad: రుతురాజ్‌ గైక్వాడ్‌ అరుదైన రికార్డు , ఆసిస్‌పై అన్ని పరుగులు చేయటం తొలిసారట

Sports Award selection committee: క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు

Sports Award selection committee:  క్రీడా పురస్కారాల ఎంపికకు కమిటీ , 12 మంది దిగ్గజాలతో ఏర్పాటు

Syed Modi International 2023 badminton: టైటిల్‌ లేకుండానే ముగిసిన భారత్‌ పోరాటం , రన్నరప్‌ గా తనీష-అశ్విని జోడి

Syed Modi International 2023 badminton: టైటిల్‌ లేకుండానే ముగిసిన భారత్‌ పోరాటం , రన్నరప్‌ గా తనీష-అశ్విని జోడి

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
×