అన్వేషించండి

WPL 2023: తొలి మ్యాచులో గుజరాత్‌ ముంబయి ఢీ - ప్లేయింగ్‌ XIలో ఎవరెవరుంటారు?

WPL 2023: విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సర్వం సిద్ధం! డీవై పాటిల్‌ స్టేడియంలో తొలి మ్యాచులో తలపడేందుకు గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ సై అంటున్నాయి.

WPL 2023:

విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సర్వం సిద్ధం! మహిళా క్రికెటర్లు ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. తొలిసారి ఉపఖండంలో మహిళ టీ20 లీగ్‌ అంగరంగ వైభవంగా జరుగుతోంది. డీవై పాటిల్‌ స్టేడియంలో తొలి మ్యాచులో తలపడేందుకు గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ సై అంటున్నాయి. మరి తుది జట్లు ఎలా ఉండబోతున్నాయ్‌! కీలక క్రికెటర్లు ఎవరు? గెలిచేదెవరు?

బలంగా ముంబయి

ముంబయి ఇండియన్స్‌ అత్యంత బలంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, పూజా వస్త్రాకర్‌ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగలరు. ముంబయిలో హర్మన్‌కు ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయి. ఆమెకిది అచ్చొచ్చిన నగరం. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ షవర్‌ బ్రంట్‌ స్పిన్‌, పేస్‌ను సునాయసంగా ఆడగలదు. మీడియం పేస్‌ బౌలింగ్‌తో అదరగొట్టగలదు. బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసే పూజా వస్త్రాకర్‌ లోయర్‌ ఆర్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. ప్రతి విభాగంలోనూ ముంబయికి ప్రత్యామ్నాయ క్రికెటర్లు ఉన్నారు. అటాకింగ్‌ వికెట్‌ కీపర్‌ లేకపోవడం లోటు. హేలీ మాథ్యూస్‌, అమెలియా కెర్‌ కీలకం అవుతారు.

సమతూకంతో గుజరాత్‌

గుజరాత్‌ జెయింట్స్‌ వేలంలో సమతూకమైన జట్టును ఎంపిక చేసింది. స్నేహ్‌ రాణా బంతిని చక్కగా ఫ్లైట్‌ చేయగలదు. ముంబయి పిచ్‌లపై ఆమె కీలకం అవుతుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌లో ప్రాధాన పాత్ర పోషించిన యాష్లే గార్డ్‌నర్‌ ఇందులోనే ఉంది. బ్యాటు, బౌలింగ్‌తో ఆమె మాయ చేయగలదు. మిడిలార్డర్లో భారీ సిక్సర్లు దంచగలదు. బ్యాటింగ్‌, బౌలింగులో మంచి ఆప్షన్లు ఉన్నాయి. కెప్టెన్‌ బెత్‌మూనీ నిలిచిందంటే పరుగుల వరదే. అనబెల్‌ సుథర్‌  డియాండ్రా డాటిన్‌ బంతి, బ్యాటుతో దుమ్మురేపుతారు. హర్లీన్‌ డియోల్‌, ఎస్‌ మేఘనా, డీ హేమలతకు ఎక్కువ అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరం.

తుది జట్లు (అంచనా)

ముంబయి ఇండియన్స్‌: యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్‌, ధారా గుజ్జర్‌, నాట్ షివర్‌ బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, అమెలియా కౌర్‌, అమన్‌జ్యోత్‌ కౌర్‌, పూజా వస్త్రాకర్‌, జింతిమని కలితా, ఇస్సీ వాంగ్‌, సోనమ్‌ యాదవ్‌ / సైకా ఇషాకి

గుజరాత్‌ జెయింట్స్‌: బెత్‌ మూనీ, సబ్బినేని మేఘన, హర్లీన్‌ డియోల్‌, యాష్ గార్డ్‌నర్‌, డీ హేమలత, డియాండ్రా డాటిన్‌, అనబెల్‌ సుథర్‌ ల్యాండ్‌, స్నేహ్‌ రాణా, హర్లీ గాలా / అశ్విని కుమారి, మానసి జోషి / మోనికా పటేల్‌, తనుజా కన్వార్‌

టైమింగ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

విమెన్‌ ప్రీమియర్‌ మ్యాచులు రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి. జియో సినిమాలో లైవ్‌ స్ట్రీమింగ్‌ అందుబాటులో ఉంది. స్పోర్ట్స్‌ 18 లైవ్‌ టెలికాస్టింగ్‌ ఉంది. అభిమానులు ఉచితంగానే మ్యాచులను వీక్షించొచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్
Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
Embed widget