అన్వేషించండి

IPL 2026: CSKతో రోహిత్ శర్మ ఆడతాడా? చెన్నై ఫ్యాన్స్‌తో ధోనీ విజిల్స్ కొట్టిస్తాడా ? బరిలోకి దిగేది ఎవరో

CSK vs MI | రోహిత్ శర్మ CSKతో మ్యాచ్ ఆడాలని.. ముంబై ఇండియన్స్‌కు విజయాన్ని అందించాలని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ధోనీ సైతం బరిలోకి దిగాలని చెన్నై ఎదురుచూస్తోంది.

Chennai Super Kings vs Mumbai Indians | చెన్నై: IPL 2026లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (CSK vs MI) మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ అభిమానులకు వీకెండ్‌లో మరింత వినోదాన్ని పంచుతుంది. అయితే రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రోహిత్ శర్మ చివరిసారిగా ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ తరువాత మళ్లీ మైదానంలో కనిపించలేదు. 

ముంబై ఇండియన్స్ జట్టు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన తర్వాత MI జట్టు నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క విజయం సాధించింది. ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ప్రతి మ్యాచ్‌లోనూ దెబ్బతింటున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టును ఈ సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తాడా లేదా అని  ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నా వారికి నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. 

రోహిత్ శర్మ బరిలోకి దిగుతాడా ?

రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే అప్‌డేట్ ఇచ్చారు. గాయం నుంచి కోలుకున్న రోహిత్ ఈరోజు సైతం CSKతో జరిగే మ్యాచ్‌లో ఆడకపోవచ్చు. అయితే జయవర్ధనే ప్రకటనలో ఎలాంటి స్పష్టత లేదు. కానీ అతడు వేగంగా కోలుకుంటున్నాడని మాత్రం చెప్పాడు.

జయవర్ధనే మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ త్వరగా కోలుకుంటున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి అతను చాలా శ్రమిస్తున్నాడు. ప్రతిరోజూ మెడికల్ టీం నుంచి రోహిత్ ఆరోగ్యం, ఫిట్ నెస్ గురించి తెలుసుకుంటున్నాం. మ్యాచ్‌కు ముందు అతను ఫిట్ అని భావిస్తే బరిలోకి దిగుతాడు. లేకపోతే రోహిత్ ను బలవంతంగా బరిలోకి దింపలేం. జట్టు ప్రయోజనాలతో పాటు ఆటగాడి ఆరోగ్యం ముఖ్యమే’ అని అన్నారు.

MIకి రోహిత్ చాలా అవసరం

ముంబై ఇండియన్స్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అవసరం చాలా ఉంది. పటిష్ట జట్టు అయినప్పటికీ ముంబై వరుసగా ఓడిపోతోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై, వ్యక్తిగతంగా అతడి ప్రదర్శనపై సైతం మేనేజ్‌మెంట్, అటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా లేరు. IPL 2026లో ఆడిన మొదటి 4 మ్యాచ్‌లలో రోహిత్ 137 పరుగులు చేశాడు. అతడిస్ట్రైక్ రేట్ 165 కంటే ఎక్కువగా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడటం అతనికి చాలా ఇష్టం. రోహిత్ ఇప్పటివరకూ CSKతో జరిగిన 36 ఇన్నింగ్స్‌లలో 972 పరుగులు చేశాడు. చెన్నై జట్టుపై అతను ఒక సెంచరీ, 8 అర్ధ శతకాలు సాధించాడు.

ఎంఎస్ ధోనీ కూడా ఆడటం కష్టమే..

నేటి రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని చెపాక్ లో ఉన్న ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచులోనూ ధోనీ బరిలోకి దిగడం కష్టమే, అతడు ఆడటం లేదని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ధోనీ నేడు సైతం ఆడే అవకాశాలు కనిపించడం లేదని చెప్పి సీఎస్కే అభిమానులను నిరాశపరిచాడు. తలా హెలికాప్టర్ షాట్ల కోసం సీఎస్కే ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget