News
News
వీడియోలు ఆటలు
X

Virat Kohli: నా లైఫ్‌లో చూసిన బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి - యశస్విపై విరాట్ పొగడ్తలు!

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్‌పై విరాట్ కోహ్లీ స్పందించాడు.

FOLLOW US: 
Share:

Yashasvi Jaiswal: ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. యశస్వి 47 బంతులు ఎదుర్కొని 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ రాయల్స్... కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వారి సొంత మైదానంలోనే తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని కూడా యశస్వి జైస్వాల్ నమోదు చేశాడు. కేవలం 13 బంతుల్లోనే యశస్వి జైస్వాల్ కొట్టేయడం విశేషం. విరాట్ కోహ్లీ కూడా యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌కు అభిమానిగా మారాడు. యశస్వి విషయంలో కోహ్లీ సోషల్ మీడియాలో స్పందించాడు.

యశస్వి జైస్వల్ తుఫాను ఇన్నింగ్స్‌ను చూసిన విరాట్ కోహ్లీ కూడా అతని అభిమాని అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్‌ను కోహ్లీ ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "నేను ఇప్పటివరకు చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటి. ఎంతటి ప్రతిభ." అని రాశాడు.

ఇప్పటివరకు యశస్వి జైస్వాల్‌కి ఈ సీజన్ అద్భుతంగా సాగింది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా రెండో స్థానానికి చేరుకున్నాడు. 12 మ్యాచ్‌లు ఆడి 575 పరుగులు చేశాడు. జైస్వాల్ ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సమయంలో, అతని అత్యుత్తమ స్కోరు 124 పరుగులుగా ఉంది. 74 ఫోర్లు, 26 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక పరుగుల స్కోర్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 11 మ్యాచ్‌లు ఆడిన ఫాఫ్ డు ప్లెసిస్ 576 పరుగులు చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే... మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ కేవలం 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

యశస్వి జైస్వాల్ (98 నాటౌట్: 47 బంతుల్లో, 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను దగ్గరుండి గెలిపించాడు. సంజు శామ్సన్ (48 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) యశస్వి జైస్వాల్‌కు చక్కటి సహకారం అందించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీని యశస్వి జైస్వాల్ సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే యశస్వి జైస్వాల్ అర్థ శతకం పూర్తయింది.

అంతకు ముందు కోల్‌కతా బ్యాటర్లలో అర్థ సెంచరీ సాధించిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

150 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు తుపాన్ ఆరంభం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (98 నాటౌట్: 47 బంతుల్లో, 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు) కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా వేసిన మొదటి ఓవర్లోనే 26 పరుగులు సాధించాడు. రెండో ఓవర్లో జోస్ బట్లర్ (0: 3 బంతుల్లో) అవుటయ్యాడు. ఆ తర్వాత యశస్వికి కెప్టెన్ సంజు శామ్సన్ (48 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) జతకలిశాడు. వీరు రెండో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించారు. ఆఖర్లో సెంచరీ దగ్గరలో కూడా యశస్వి జైస్వాల్ జట్టు ప్రయోజనాల కోసం మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. శతకానికి రెండు పరుగులు దూరంలో ఆగిపోయాడు.

Published at : 12 May 2023 12:10 AM (IST) Tags: KKR vs RR IPL 2023 Yashasvi Jaiswal

సంబంధిత కథనాలు

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?

Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్