అన్వేషించండి

India Vs Australia: లార్డ్స్ లో ప్రాక్టీస్ గొడ‌వ‌.. ఆసీస్ కు చేదు అనుభ‌వం.. కార‌ణం టీమిండియానా..?

ఆసీస్ ఇప్ప‌టికే డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ను ఆడ‌గా, సౌతాఫ్రికా తొలిసారి ఈ టోర్నీ తుదిపోరులో ఆడుతోంది. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆసీస్ ఈ టోర్నీ ఫైన‌ల్లో గెలిచాయి. రెండుసార్లు భార‌తే ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.

Ind Vs Eng Test Series: వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్  కు ముందు చిన్న వివాదం జ‌రిగింది. మ్యాచ్ వేదికైన లండ‌న్ లోని లార్డ్స్ మైదానం లోకి ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ల ఎంట్రీకి ప‌ర్మిష‌న్ దొర‌క‌లేద‌ని తెలుస్తోంది. ఈనెల 11 నుంచి ఆసీస్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆసీస్ వ‌రుస‌గా రెండో ఫైన‌ల్ ఆడ‌బోతోంది. ఈ మ్యాచ్ లో ఆ జ‌ట్టే ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతోంది. అయితే లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు ఆసీస్ జ‌ట్టుకు తొలుత ప‌ర్మిష‌న్ ల‌భించ‌క‌పోగా, ఆ త‌ర్వాత ఆదివారం నుంచి ఆ జ‌ట్టు ప్రాక్టీస్ కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఆసీస్ జ‌ట్టు ప్రాక్టీస్ చేయ‌క‌పోవ‌డానికి, టీమిండియాకు మ‌ధ్య సంబంధం ఉన్న‌ట్ల తెలుస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే..
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇప్ప‌టికే ఇంగ్లాండ్ కు టీమిండియా చేరుకుంది. ఈనెల 20 నుంచి హెడీంగ్లీలో ఇరుజ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు జ‌రుగుతుంది. అయితే ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు లార్డ్స్ లో ప్రాక్టీస్ చేయడంతో ఈ త‌క‌రారు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆ త‌ర్వాత లైన్ క్లియ‌ర్ కావ‌డంతో ఆసీస్ జ‌ట్టు ప్రాక్టీస్ కు వెళ్లింది. ఇక ఫైన‌ల్ కు సంబంధించి ప్రిప‌రేష‌న్ల‌ను ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ పంచుకున్నాడు. నిజానికి యాషెస్ సిరీస్ సంద‌ర్బంగా ఇక్క‌డ ఆడిన‌ప్పుడు త‌మ‌కు చాలా నెగిటివ్ స్వాగతం ల‌భించింద‌ని, ఈసారి డ‌బ్ల్యూటీసీ చాంపియ‌న్షిప్ లో అభిమానులు త‌మ‌కు అనుకూలంగా మ‌ద్ద‌తిస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

పేస్ ద‌ళాన్ని లీడ్ చేస్తున్న క‌మిన్స్..
ఆసీస్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌తోపాటు పేస్ బౌలింగ్ ద‌ళాన్ని కూడా క‌మిన్స్ నడిపిస్తున్నాడు. జోష్ హేజిల్ వుడ్, మిషెల్ స్టార్క్ తోపాటు నేథ‌న్ ల‌యోన్ ల‌ను బౌలింగ్ భారాన్ని పంచుకుంటున్నారు. ఇక కామెరాన్ గ్రీన్ కూడా నాలుగో పేస‌ర్ గా బ‌రిలోకి దిగుతాడు. మ‌రోవైపు టీమిండియా లార్డ్స్ లో ప్రాక్టీస్ చేయ‌డం వెన‌క మిస్ట‌రీ అంతుబ‌ట్ట‌డం లేదు. ఐదు టెస్టుల సిరీస్ లో నాలుగో మ్యాచ్ లో ఈ వేదిక‌పై జ‌రుగుతుంది. అది కూడా జూలై నెల‌లో ఉండ‌టం విశేషం. అయితే ఇప్ప‌టికిప్ప‌డు టీమిండియా ఇక్క‌డ ప్రాక్టీస్ చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్ షిప్ 2025-27 రేసును ఈ టూర్ తో భార‌త్ ప్రారంభించ‌నుంది. ఈ సిరీస్ ను గెలిచి శుభారంభం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది.  ఈ నెలలోనే ఈ రెండు జట్ల మధ్య అయిదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ స్టార్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ స్థానంలో సచిన్, అండర్సన్ పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. జూన్ 11 న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త జెర్సీని ఆవిష్కరించనున్నారు. అయితే ఇరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ పేరు మార్పుపై భారత దిగ్గజలు అన్ హేపీ గా ఫీల్ అవతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget