IPL 2025 SRH VS DC Match Abandoned: సన్ రైజర్స్ ఔట్.. ఆరెంజ్ ఆర్మీని దెబ్బ కొట్టిన వరుణుడు.. గెలిచే మ్యాచ్ వర్షార్పణం.. రాణించిన కమిన్స్.. ఢిల్లీకి ఊరట
మరో 3 మ్యాచ్ లు ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ నిష్క్రమించింది. సోమవారం ఢిల్లీతో మ్యాచ్ రద్దు కావడంతో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే సాధించింది. దీంతో నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది.

IPL 2025 SRH Out Of The Play-Offs Race: గతేడాది రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లకు ఒక్క పాయింట్ చొప్పున కేటాయించారు. దీంతో 7 పాయింట్లతో నిలిచిన సన్.. టోర్నీలో ముందుడగు వేసే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీలో ఇంకా మూడు మ్యాచ్ లు ఉన్నప్పటికీ, అవి గెలిచినా 13 పాయింట్లకే పరిమితం అవుతుంది, కాబట్టి ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీ ప్రస్థానం ముగిసినట్లే. రాబోయే మూడు మ్యాచ్ లను కేవలం పరువు కోసం ఆడనుంది. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ చెరో 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సన్ కెప్టెన్ పాట్ కమిన్స్ 3 వికెట్లతో రాణించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిశాక, ఎడతెరిపి లేని వర్షం కురవడంతో మ్యాచ్ రద్దు అయింది.
No way out for the batters when Pat Cummins is breathing fire 🙅🔥
— IndianPremierLeague (@IPL) May 5, 2025
The #SRH captain put on a bowling masterclass tonight 🙌
RELIVE his spell ▶️ https://t.co/0Kwa6nYqKU#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/GJjTQxnwuy
బతికి పోయిన ఢిల్లీ..
నిజానికి ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా ఢిల్లీ బతికిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి శుభారంభం దక్కలేదు. పవర్ ప్లేలోనే కమిన్స్ ధాటికి కరుణ్ నాయర్ డకౌట్, ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పొరెల్ (8), కెప్టెన్ అక్షర్ పటేల్ (6) వికెట్లను కోల్పోయింది. కాసేపటికే కేఎల్ రాహుల్ (10) కూడా ఔట్ కావడంతో 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దయనీయ పరిస్థితుల్లో నిలిచింది. ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41 నాటౌట్, 4 ఫోర్లు) మెచ్యూర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తొలుత విప్రజ్ నిగమ్ (18) తో ఆరో వికెట్ కు 33 పరుగులు జోడించిన స్టబ్స్ .. అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కీలకమైన 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఢిల్లీ కోలుకుంది. అయితే ఫైర్ పవర్ తో కూడిన సన్ రైజర్స్ కు ఈ టార్గెట్ ఏమాత్రం సరిపోదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వర్షం రావడంతో ఓటమి నుంచి ఢిల్లీ తప్పించుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా ఫలితంతో టోర్నీ నుంచి సన్ అఫిషీయల్ గా ఔటైనట్లే..
A brilliant partnership between Tristan Stubbs & Ashutosh Sharma! #TATAIPL #SRHvDC pic.twitter.com/KQafrQL4cD
— Khel Cricket (@Khelnowcricket) May 5, 2025
బరిలో ఏడు జట్లు..
వరుస పరాజయాలతో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. తాజాగా సన్ కూడా టోర్నీ నుంచి నాకౌట్ అవడంతో ఇప్పుడు బరిలో ఏడు జట్లే మిగిలాయి. ఆర్సీబీ 16, పంజాబ్ కింగ్ 15 పాయింట్లతో టాప్-2లో నిలిచాయి. ఈ ఇరుజట్లకు ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండటంలో కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ కు చేరిపోతాయి. ముంబై ఇండియన్స్ , గుజరాత్ టైటాన్స్ చెరో 14 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా నిలిచాయి. ఇవి కూడా కనీసం మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్స్ పక్కా అవతుంది. జీటీ చేతిలో 4 మ్యాచ్ లు ఉండటంతో టాప్-2లో నిలవడంపై ఫోకస్ పెట్టింది. ఇక డీసీ చేతిలో 13, కేకేఆర్ 11, లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో వరుసగా 5, 6, 7వ స్థానాల్లో నిలిచాయి. ఈ జట్లకు ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండటంతో ఆ మ్యాచ్ ల్లో విజయంపై దృష్టి సారించాయి. ఇక కేకేఆర్, లక్నో ఒక్క మ్యాచ్ లో ఓడినా దాదాపు టోర్నీ నుంచి నాకౌట్ అయిపోతాయి. డీసీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఏదేమైనా మరో వారం రోజుల్లో ప్లే ఆఫ్స్ జట్లపై క్లారిటీ వస్తుంది.




















