SRH Vs DC: ఉప్పల్ స్టేడియంలో తడబడ్డ వార్నర్ ఆర్మీ - రైజర్స్ ముందు ఈజీ టార్గెట్!
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2023 సీజన్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ స్కోరుకు పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీష్ పాండే (34: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మొదటి ఓవర్లోనే ఫిల్ సాల్ట్‌ను (0: 1 బంతి) అవుట్ చేసి భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్‌కు మొదటి వికెట్ అందించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ మార్ష్ (25: 15 బంతుల్లో, ఐదు ఫోర్లు) వేగంగా ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. తనకు డేవిడ్ వార్నర్ (21: 20 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందిచాడు. కానీ స్వల్ప వ్యవధిలోనే వీరిద్దరూ అవుటయ్యారు. దీంతో 57 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత వచ్చిన అమన్ హకీమ్ ఖాన్ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్), సర్ఫరాజ్ ఖాన్ (10: 9 బంతుల్లో, ఒక సిక్సర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో 62 పరుగులకే ఢిల్లీ సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండే (34: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. కానీ బంతులు మాత్రం బాగా వృథా అయ్యాయి. దీనికి తోడు వీరిద్దరూ మూడు పరుగుల తేడాలోనే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు వేగంగా ఆడలేకపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులకే పరిమితం అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. టి నటరాజన్ ఒక వికెట్ తీసుకున్నాడు.
Half the job done ✅😎
— SunRisers Hyderabad (@SunRisers) April 24, 2023
It's time to pick up the willows 🏏💪 pic.twitter.com/MRWHWS3erU
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, రిపాల్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, చేతన్ సకారియా, యష్ ధుల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నితీష్ రెడ్డి, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, రాహుల్ త్రిపాఠి