Keshav Maharaj: అయోధ్య రాముడ్ని దర్శించుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్
IPL 2024: సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహరాజ్ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించాడు. మందిరంలో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని పేర్కొన్నాడు.
Keshav Maharaj Offered Prayers At Ram Temple In Ayodhya Uttar Pradesh: దక్షిణాఫ్రికా(South African)కు చెందిన వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్(Keshav Maharaj ) అయోధ్య శ్రీరాముని దర్శించుకున్నాడు. ఈ విషయాన్ని అనంతరం ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 2024 ఐపీఎల్‌లో పాల్గొనేందుకు కేశవ్ ఇటీవలే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు లక్నో సూపర్ జెయింట్స్‌కు (Lucknow Super Giants) ప్రాతినిధ్యం వహించనున్నాడు. గతేడాది కూడా వన్డే వరల్డ్‌కప్ సమయంలో భారత్‌కు వచ్చిన కేశవ్ కేరళలోని పలు ఆలయాలు, అప్పట్లో తిరువనంతపురంలోని ప్రముఖ దేవాలయం పద్మనాభస్వామి మందిరాన్ని సందర్శించాడు.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్(Keshav Maharaj) అప్పట్లో సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందని, దేశ వ్యాప్తంగానే కాకుండా దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నానన్నారు . అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలని కోరుకుంటున్నానన్నారు.
పూర్వీకులు భారతీయులే...