Sanju Samson Injury: సంజూ శాంసన్ కి గాయం.. 5 వారాలపాటు దూరం.. ఐపీఎల్ నుంచే తిరిగి బరిలోకి..
సంజూకి గాయం కారణంగా 5-6 వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. తను రంజీట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు. సంజూ హోం టీమ్ కేరళ.. జమ్మూ, కశ్మీర్ తో ఈనెల 8న తలపడనుంది.

Ind Vs Eng T20 Series Updates: ఇండియన్ టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ గాయంతో ఐదారు వారాలు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు. ఆదివారం ముంబైలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టీ20లో తను గాయపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా విసిరిన బంతి సంజూ కుడివేలి చూపుడు వేలుకు తాకడంతో బాధతో విలవిలలాడిపోయిన సంజూ.. డ్రెస్సింగ్ రూంకి వెళ్లి పోయాక వేలు ఉబ్బినట్లు కనిపించింది. దీంతో స్కాన్ తీయగా విరిగినట్లు తేలింది. దీంతో అతడికి 5-6 వారాలపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. దీంతో తను ఈనెల 8 నుంచి ప్రారంభమయ్యే రంజీట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు. సంజూ హోం టీమ్ కేరళ.. జమ్మూ, కశ్మీర్ తో తలపడనుంది. తను నేరుగా ఐపీఎల్ తోనే బరిలోకి దిగే అవకాశముంది. రాజస్థాన్ రాయల్స్ కు తను నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
🚨 Injury setback for Sanju Samson!
— Sportz Point (@sportz_point) February 3, 2025
The Indian wicket-keeper has fractured his index finger during the 5th T20I and is expected to be out of action for 5-6 weeks. Wishing him a speedy recovery! 💙🏏#SanjuSamson #TeamIndia #IndianCricket #SuryakumarYadav #GautamGhambir pic.twitter.com/MNHcpHHdoi
జూలై వరకు నో ఇంటర్నేషనల్ మ్యాచ్ లు..
తాజా గాయంతో మిణుకుమిణుకు మంటున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆశలు ఆవిరయ్యాయి. ఎవరైనా ప్లేయర్ గాయపడితే రీప్లేస్మంట్ కు కూడా తనను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ప్రస్తుతానికి తనను టీ20ల్లోనే పరిగణిస్తుండటంతో వచ్చే జూలై వరకు తను అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. జూలైలో బంగ్లాదేశ్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సంజూ అక్కడ బరిలోకి దిగనున్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో తను ఘోరంగా విఫలమయ్యాడు. పవర్ ప్లేలోపలే ఐదుసార్లు ఒకే తరహాలో ఔటవడంతో అతని బలహీనత బయటపెట్టుకున్నట్లయింది. ఇక ఈ సిరీస్ లో కేవలం 51 పరుగులు మాత్రమే సంజూ చేశాడు. కోల్కతాలో జరిగిన తొలి టీ20లో చేసిన 26 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం.
మూడు సెంచరీలతో జోరు..
వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓపెనర్ గా కుదురుకున్న సంజూ సెంచరీలతో సత్తా చాటాడు. బంగ్లాదేశ్, సౌతాఫ్రికా సిరీస్ లలో మొత్తం కలిపి మూడు సెంచరీలు చేసి తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో ఘోరంగా విఫలమైన 30 ఏళ్ల సంజూ.. తన స్థానంపై మళ్లీ అనుమానాలు రేకెత్తించాడు. ఏదేమైనా రాబోయే సిరీస్ లో తను మళ్లీ సత్తా చాటాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల కేరళ క్రికెట్ సంఘంతో తన తండ్రి కాస్త ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. సంజూ గాయంతో దేశవాళీల్లో అతని అవసరం కూడా లేకుండా పోయింది. మరోవైపు ఐపీఎల్ వచ్చేనెల 21 నుంచి ప్రారంభంకానుంది. మే 25 వరకు జరుగుతుంది.
Also Read: Praggnanandhaa Vs Gukesh: ప్రజ్ఞానంద చేతిలో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంపియన్ గుకేశ్




















