RR Vs RCB: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు - భారీ టార్గెట్ పెట్టాలని ఫిక్స్!
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 60వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట రాజస్తాన్ రాయల్స్ (RR) మొదట బౌలింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు మార్పులు చేసింది. జోష్ హజిల్‌వుడ్ స్థానంలో వేన్ పార్నెల్ జట్టులోకి వచ్చాడు. ఇక వనిందు హసరంగ స్థానంలో మైకేల్ బ్రేస్‌వెల్‌కు స్థానం దక్కింది. రాజస్తాన్ రాయల్స్ మాత్రం ఒక్క మార్పే చేసింది. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడం జంపా తుది జట్టులోకి రానున్నాడు.
పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ ఐదో స్థానంలోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే మూడో స్థానంలోకి వెళ్లనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిస్తే నెట్ రన్‌రేట్‌ను బట్టి ఐదో స్థానం వరకు చేరవచ్చు. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మాత్రం రెండు జట్లకూ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా కీలకం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు
విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
విజయ్‌కుమార్ వైషాక్, ఫిన్ అలెన్, షాబాజ్ అహ్మద్, హిమాన్షు శర్మ, సుయాష్ ప్రభుదేశాయ్
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, కుల్దీప్ యాదవ్, డోనావన్ ఫెరీరా, నవదీప్ సైనీ.
ఐపీఎల్-16 లీగ్ స్టేజ్ ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో ఉంది. ప్లేఆఫ్స్ స్టార్ట్ అవడానికి ఇంకా 11 మ్యాచ్ లు మాత్రమే మిగిలినా ఆ దశకు చేరే నాలుగు జట్లపై ఇప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి. టాప్ - 4 లో చోటు దక్కించుకునేందుకు నేడు మరో రెండు జట్లు హోరాహోరి పోరాడబోతున్నాయి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు నేటి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మొదలయ్యే కీలక పోరులో ‘ఢీ’కొనబోతున్నాయి.
ఈ సీజన్‌లో ఆర్సీబీ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్ మీద అతిగా ఆధారపడింది. ఆ జట్టు ఇప్పటివరకు చేసిన పరుగులలో 70 శాతం కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్ (కేజీఎఫ్) చేసినవే. ఈ ముగ్గురూ ఔటైతే ఆర్సీబీ చాప్టర్ దాదాపు క్లోజ్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. లోమ్రర్, కార్తీక్, అనూజ్ రావత్ లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. మరి నేటి మ్యాచ్ లో అయినా కేజీఎఫ్ కాకుండా మిగిలిన బ్యాటర్లు ఆడతారో లేదో చూడాలి.