అన్వేషించండి

IPL 2024: ప్లే ఆఫ్‌ కోసం రాజస్థాన్‌, పరువు కోసం పంజాబ్‌

RR vs PBKS, 2024: ప్లే ఆఫ్‌ రేసుకు దూరమైన పంజాబ్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుండగా...ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్‌కు చేరాలని రాజస్థాన్‌ పట్టుదలగా ఉంది.

RR vs PBKS  2024  match 65 Preview and Prediction :  ఐపీఎల్‌(IPL)లో ప్లే ఆఫ్‌కు చేరుకున్న రెండో జట్టుగా నిలవాలని భావిస్తున్న రాజస్థాన్‌(RR).. పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ రేసుకు దూరమైన పంజాబ్‌.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుండగా...ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్‌కు చేరాలని రాజస్థాన్‌ పట్టుదలగా ఉంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్‌ను... ఆత్మవిశ్వాసం లోపించిన పంజాబ్‌ ఎంతవరకూ అడ్డుకోగలదో చూడాలి. ఈ మ్యాచ్‌లో సొంత మైదానంలో బరిలోకి దిగనున్న రియాన్‌ పరాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
 
ఫేవరెట్‌గా రాజస్థాన్‌
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న రియాన్ పరాగ్... ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటివరకూ 12 మ్యాచులు ఆడి ఎనిమిది విజయాలతో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు... అస్సాంలోని గౌహతీలో జరిగే  ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. పరాగ్ ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లోనే 153 స్ట్రైక్ రేట్‌తో 483 పరుగులు చేసిన పరాగ్‌.... మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. సంజూ శాంసన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు కూడా రాణిస్తే రాజస్థాన్‌ గెలుపునకు అడ్డే ఉండదు. యశస్వి జైస్వాల్ 344 పరుగులు, జోస్ బట్లర్ 359 పరుగులతో మంచి టచ్‌లో ఉన్నారు. పరాగ్, శాంసన్ మరోసారి రాణిస్తే పంజాబ్‌ గెలుపు కష్టమే. రాజస్థాన్‌ జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. రియాన్, కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధృవ్ జురెల్‌లతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది.ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ , అవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లతో బౌలింగ్‌ కూడా చాలా బలంగా ఉంది. 
 
పంజాబ్‌కు కష్టమే
పంజాబ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ నుంచి దూరమైన పంజాబ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. పంజాబ్‌ బ్యాటర్లు మరోసారి మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌, జానీ బెయిర్‌స్టోపై పంజాబ్‌ బ్యాటింగ్‌ భారం ఉంది. జితేష్ శర్మ నుంచి పంజాబ్‌ భారీ స్కోరు ఆశిస్తోంది. కగిసో రబడా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, శామ్ కరణ్‌లు ఉన్నా పంజాబ్‌ బౌలింగ్‌ బలహీనంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శిఖర్ ధావన్ గాయం కారణంగా ఈ సీజన్‌లో కెప్టెన్సీ చేపట్టిన శామ్‌ కరణ్‌ ఆకట్టుకోలేక పోయాడు. 
 
జట్లు
పంజాబ్ కింగ్స్: శామ్ కరణ్‌ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, జానీ బెయిర్‌స్టో , ప్రభ్‌సిమ్రాన్ సింగ్ , జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ , హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.
 
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget