RR Vs MI, IPL 2022 LIVE: అదరగొట్టిన రాజస్తాన్ బౌలర్లు - ముంబైపై భారీ విజయం - ఈ సీజన్‌లో తొలిసారి అలా!
రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
Background
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్‌కు టోర్నమెంట్‌లో ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ టీమ్ నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం రాజస్తాన్ నెట్ రన్‌రేట్ +3.050గా ఉంది. ఇక ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
అదరగొట్టిన రాజస్తాన్ బౌలర్లు - ముంబైపై భారీ విజయం - ఈ సీజన్‌లో తొలిసారి అలా!
నవదీప్ సైనీ వేసిన ఈ ఓవర్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 20 ఓవర్లలో ముంబై స్కోరు 170-8కు పరిమితం అయింది. రాజస్తాన్ 23 పరుగులతో భారీ విజయం సాధించింది. ఈ సీజన్‌లో తొలిసారి టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ ఓడిపోయింది. చివరి ఓవర్లో పొలార్డ్ క్రీజులో ఉన్నా నవదీప్ సైనీ తనను కట్టడి చేయడం విశేషం.
19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 165-7
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 165-7గా ఉంది.
కీరన్ పొలార్డ్ 18(18)
జస్‌ప్రీత్ బుమ్రా 0(1)
ప్రసీద్ కృష్ణ 4-0-37-1
మురుగన్ అశ్విన్ (రనౌట్) సంజు శామ్సన్ (6: 8 బంతుల్లో, ఒక ఫోర్)
18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 155-6
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 155-6గా ఉంది.
కీరన్ పొలార్డ్ 12(12)
మురుగన్ అశ్విన్ 6(8)
ట్రెంట్ బౌల్ట్ 4-0-29-1
17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 144-6
ప్రసీద్ కృష్ణ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 144-6గా ఉంది.
కీరన్ పొలార్డ్ 1(8)
మురుగన్ అశ్విన్ 6(6)
ప్రసీద్ కృష్ణ 3-0-27-1
16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 137-6
యుజ్వేంద్ర చాహల్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు వచ్చింది. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 137-6గా ఉంది. మొదటి రెండు బంతులకే టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్ అవుటయ్యారు. మూడో బంతికి మురుగన్ అశ్విన్ క్యాచ్ ఇచ్చినా కరుణ్ నాయర్ వదిలేయడంతో హ్యాట్రిక్ మిస్సయింది.
కీరన్ పొలార్డ్ 0(6)
మురుగన్ అశ్విన్ 1(2)
యుజ్వేంద్ర చాహల్ 4-0-26-2
టిమ్ డేవిడ్ (ఎల్బీడబ్ల్యూ)(బి) చాహల్ (1: 3 బంతుల్లో)
డేనియల్ శామ్స్ (సి) బట్లర్(బి) చాహల్(0: 1 బంతి)