By: ABP Desam | Updated at : 08 Apr 2023 06:15 PM (IST)
అర్థ సెంచరీ అనంతరం అభివాదం చేస్తున్న జోస్ బట్లర్ (Image Credits: IPL)
Rajasthan Royals vs Delhi Capitals: ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (79: 51 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్ (60: 31 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (79: 51 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (60: 31 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ ఐదు ఫోర్లు కొట్టాడు. జోస్ బట్లర్ కూడా అదే ఊపు కొనసాగించాడు. దీంతో రాజస్తాన్ పవర్ ప్లే ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో యశస్వి జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత కాసేపటికే యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్ మొదటి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 98 పరుగులు జోడించారు. కెప్టెన్ సంజు శామ్సన్ (0: 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. తర్వాత రియాన్ పరాగ్ (7: 11 బంతుల్లో) కూడా విఫలం అయ్యాడు. చివర్లో జోస్ బట్లర్‌కు షిమ్రన్ హెట్‌మేయర్ (39 నాటౌట్: 21 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) జత కలిశాడు. ముఖ్యంగా హెట్‌మేయర్ సిక్సర్లతో చెలరేగాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, రొవ్‌మన్ పావెల్‌లకు చెరో వికెట్ దక్కింది.
Innings Break!@rajasthanroyals score a solid first-innings total of 199/4 in the first innings 👌🏻👌🏻
A challenging chase coming up for #DC. Can they do it❓
Scorecard ▶️ https://t.co/FLjLINwRJC#TATAIPL | #RRvDC pic.twitter.com/wNDrEnvSDY— IndianPremierLeague (@IPL) April 8, 2023
.@josbuttler displayed his opening brilliance by scoring 79 off 51 deliveries and he becomes our 🔝 performer of the first innings of the #RRvDC clash in the #TATAIPL.
— IndianPremierLeague (@IPL) April 8, 2023
A look at his batting summary 🔽 pic.twitter.com/dpQZzcvwIe
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
అమన్ హకీమ్ ఖాన్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ దూబే
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
నవదీప్ సైనీ, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, డోనావన్ ఫెరీరా
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?