RR Vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ - చెన్నైకి రివెంజ్ దొరికేనా?
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Rajasthan Royals vs Chennai Super Kings: ఐపీఎల్ 2023 సీజన్ 37వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ చేయనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లూ ఇప్పటికే ఒకసారి తలపడ్డాయి. చెపాక్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడు పరుగులతో విజయం సాధించింది. ఇప్పుడు చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి లెక్క సరిచేయాలని చూస్తుంది.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే వారి స్థానం మరింత పటిష్టం అవుతుంది. అదే రాజస్తాన్ గెలిస్తే వారు మొదటి స్థానానికి వెళ్తారు. అప్పుడు చెన్నై రెండో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ చెన్నై భారీ తేడాతో ఓడితే మూడో స్థానానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
డొనొవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, కేఎం ఆసిఫ్, కుల్దీప్ సేన్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, డ్వేన్ ప్రిటోరియస్, షేక్ రషీద్, రాజ్‌వర్థన్ హంగర్గేకర్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ మధ్య 27 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒక మ్యాచ్ ఇప్పటికే జరిగింది. అంతకుముందు ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ జట్టు మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
బ్యాటింగ్ పరంగా ఇరు జట్లు దాదాపు సమానంగానే ఉన్నాయి. బౌలింగ్ లో మాత్రం చెన్నై జట్టు కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. చెన్నై ఫాస్ట్ బౌలర్లలో అనుభవజ్ఞులైన బౌలర్లు లేరు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌లో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ వంటి మంచి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ విభాగం బాగుంది. రవీంద్ర జడేజా, మహీష్ తీక్షణ, మొయిన్ అలీ వంటి స్పిన్నర్లు ఉన్నారు. కానీ రాజస్థాన్‌లో అత్యుత్తమ స్పిన్ త్రయం (యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, ఆడం జంపా) ఉంది.