RR Vs CSK: చెన్నైపై రాజస్తాన్ రికార్డ్ బ్రేకింగ్ స్కోరు - ధోని సేన ముందు భారీ లక్ష్యం!
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.
Rajasthan Royals vs Chennai Super Kings: ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77: 43 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ మైదానంలో ఇదే అత్యధిక స్కోరు. మరి ఇంత భారీ స్కోరును చెన్నై ఛేదిస్తుందా? లేదా? అన్నది చూడాలి. చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 120 బంతుల్లో 203 పరుగులు కావాలి.
రాజస్తాన్‌కు మెరుపు ఆరంభం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జోస్ బట్లర్ (27: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు), యశస్వి జైస్వాల్ (77: 43 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రాజస్తాన్‌కు ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చారు. ఆకాష్ సింగ్ వేసిన మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ మూడు ఫోర్లు కొట్టాడు. వీరిద్దరూ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడంతో రాజస్తాన్ రాయల్స్ మొదటి ఆరు ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. ఏడు, ఎనిమిది ఓవర్లలో 22 పరుగులు రాబట్టారు. అయితే తొమ్మిదో ఓవర్లో జోస్ బట్లర్‌ను అవుట్ చేసి రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు మొదటి వికెట్ అందించాడు. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజు శామ్సన్ (17: 17 బంతుల్లో, ఒక ఫోర్) వేగంగా ఆడలేకపోయాడు. రెండో వికెట్‌కు యశస్వి జైస్వాల్‌తో కలిసి 39 పరుగులు జోడించిన అనంతరం ఇన్నింగ్స్ 14వ ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.
కాసేపటికే యశస్వి జైస్వాల్, షిమ్రన్ హెట్‌మేయర్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యారు. అయితే ఈ దశలో ధ్రువ్ జురెల్ (34: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (23 నాటౌట్: 13 బంతుల్లో, ఐదు ఫోర్లు) రాజస్తాన్‌ను ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు కేవలం 20 బంతుల్లోనే 48 పరుగులు జోడించారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ 200 పరుగుల మైలురాయిని దాటింది.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
డొనొవన్ ఫెరీరా, మురుగన్ అశ్విన్, రియాన్ పరాగ్, కేఎం ఆసిఫ్, కుల్దీప్ సేన్
చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, డ్వేన్ ప్రిటోరియస్, షేక్ రషీద్, రాజ్‌వర్థన్ హంగర్గేకర్