News
News
X

WPL 2023: ఈ సాలా కప్‌ నమదే - అమ్మాయిలైనా RCB ఫేట్‌ మారుస్తారా?

RCB-W vs DC-W: విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ఉర్రూతలూగించే మరో ఇంట్రెస్టింగ్‌ పోరుకు రంగం సిద్ధం! రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) దిల్లీ క్యాపిటల్స్‌తో (DC) తలపడుతున్నాయి.

FOLLOW US: 
Share:

WPL 2023:

విమెన్‌ ప్రీమియర్‌ లీగులో ఉర్రూతలూగించే మరో ఇంట్రెస్టింగ్‌ పోరుకు రంగం సిద్ధం! స్టార్లతో నిండిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) అప్‌కమింగ్‌ స్టార్లున్న దిల్లీ క్యాపిటల్స్‌తో (DC) తలపడుతోంది. ముంబయిలోని బ్రబౌర్న్‌ మైదానం ఇందుకు వేదిక! మరి తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి? స్మృతి మంధాన vs మెగ్‌ లానింగ్‌ పోటీలో విజయం ఎవరిది?

స్టార్‌ ప్లేయర్ల సవాల్‌

స్మృతి మంధాన vs జెమీమా రోడ్రిగ్స్‌. ఎలిస్‌ పెర్రీ vs మెగ్‌ లానింగ్‌. డేన్‌ వాన్‌ నీకెర్క్‌ vs మారిజానె కాప్‌. క్రికెటర్ల పేర్లు చదువుతుంటూనే కిక్కెక్కుతోంది కదూ! మరి ఫుల్లుగా ప్యాకైన బ్రబౌర్న్‌ స్టేడియంలో వీరు పోటీ పడుతుంటే ఎంత మజాగా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు వీరంతా అభిమానులను అలరించనున్నారు. బెంగళూరు, దిల్లీ తమ మూల సూత్రాన్నే ఇక్కడా పాటిస్తున్నాయి. మంధాన, పెర్రీ, నీకెర్గ్‌ వంటి ప్రపంచ స్టార్లను ఆర్సీబీ తీసుకుంటే షెఫాలీ, జెమీమా, రాధా యాధవ్‌ వంటి యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ ఇండియన్స్‌ను డీసీ పట్టేసింది.

బ్యాలెన్స్‌డ్‌గా ఆర్సీబీ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) అత్యంత సమతూకంగా కనిపిస్తోంది. స్మృతి మంధాన, దిశా కసత్‌తో టాప్‌ ఆర్డర్‌ బాగుంది. సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, డేన్‌ వాన్‌ నీకెర్గ్‌, రిచా ఘోష్‌తో కూడిన మిడిలార్డర్‌ దుమ్మరేపగలదు. తనకు బాగా తెలిసిన ఉపఖండం పరిస్థితులను గట్టిగా ఉపయోగించుకోవాలని స్మృతి పట్టుదలగా ఉంది. విదేశీ, స్వదేశీ అమ్మాయిలతో సమతూకం కోసం ప్రయత్నిస్తోంది. ఎక్కువ మంది స్టార్లు విదేశీయులు కావడంతో ఎంపికలో కొంత తలనొప్పి తప్పదు. మేఘన్ షూట్‌, రేణుకా సింగ్‌, ఎలిస్‌ పెర్రీతో పేస్‌ బలంగా ఉంది. నీకెర్గ్‌ స్పిన్‌ వేయగలదు.

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ డీసీ

దిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) యంగ్‌, సీనియర్‌ క్రికెటర్ల సమ్మేళనంతో కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లు గెలవడంలో డీసీ కెప్టెన్ మెగ్‌లానింగ్‌కు తిరుగులేదు. ఈ మధ్యే దక్షిణాఫ్రికాలో కప్పు ముద్దాడి వస్తోందామె. గెలుపు సంస్కృతిని డీసీలో ప్రవేశపెడతానని ఆమె అంటోంది. సరైన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకొనేందుకు టీమ్‌ఇండియా యువ కెరటాలు జెమీమా, షెఫాలీ సాయం తీసుకుంటానని అంటోంది. షెఫాలి, జెమీమా, లానింగ్‌తో టాప్‌ ఆర్డర్‌ భయంకరంగా ఉంది. వీరిలో ఏ ఒక్కరు నిలిచినా పరుగుల వరదే. మారిజాన్‌ కాప్‌, లారా హ్యారిస్‌, జైసా అక్తర్‌, తానియా భాటియా మిడిలార్డర్లో కీలకం అవుతారు. రాధాయాదవ్‌, జెస్‌ జొనాసెన్‌, పూనమ్‌ యాదవ్‌ బంతిని గింగిరాలు తిప్పుతూ మాయ చేయగలరు. శిఖా పాండే, కాప్‌, టారా నోరిస్‌ పేస్‌ బౌలింగ్‌ చూస్తారు. మిగిలిన పేసర్లకు అనుభవం తక్కువ.

తుది జట్లు (అంచనా)

దిల్లీ క్యాపిటల్స్‌: షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, మెగ్‌ లానింగ్‌, మారిజాన్‌ కాప్‌, లారా హ్యారిస్‌, జైసా అక్తర్‌, తానియా భాటియా, జెస్‌ జొనాసెన్‌, రాధా యాదవ్‌, శిఖా పాండే, టారా నోరిస్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: స్మృతి మంధాన, దిశా కసత్‌, సోఫీ డివైన్‌, ఎలిస్‌ పెర్రీ, డేన్‌ వాన్‌ నీకెర్గ్‌, రిచా ఘోష్‌, కోమల్‌ జన్‌జాడ్‌ / ఆశా శోభన, ప్రీతి బోస్‌, మేఘన్ షూట్‌, రేణుకా సింగ్‌, కనికా అహుజా / శ్రేయాంక పాటిల్‌

Published at : 05 Mar 2023 11:28 AM (IST) Tags: Delhi Capitals WPL Womens Premier League WPL 2023 Royal Challengers Bangalore RCB-W vs DC-W

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!

Sangareddy Crime News: భూ వివాదంతో పెద్దనాన్న హత్య - తల, మొండెం వేరు చేసి ఒక్కోచోట పడేసిన తమ్ముడి కొడుకు!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్