Viral Video: రోహిత్ లక్కీ రివ్యూ.. రెండో ఓవర్లోనే రివ్యూతో బతికి పోయిన హిట్ మ్యాన్.. సోషల్ మీడియాలో రచ్చ
ముంబై వరుసగా ఆరో విజయంపై కన్నేసింది. రాయల్స్ తో మ్యాచ్ లో భారీ స్కోరు సాధించి, విజయానికి తగ్గ పునాది వేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఆదిలోనే రివ్యూ తీసుకుని రోహిత్.. స్టన్నింగ్ ఫిఫ్టీ చేశాడు.

IPL 2025 Rohit Sharma Review: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పని గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో తను ఆఖరి క్షణంలో రివ్యూ తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఆ రివ్యూ ఫలితం తనకు అనుకూలంగా రావడంతో క్రికెట్ ప్రేమికుల మనసుల్లో ఎన్నో ప్రశ్నలకు లేవనెత్తుతోంది. ఆఫ్గానిస్థాన్ బౌలర్ ఫజల్ హఖ్ ఫరూఖీ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ ఐదో బంతిని రోహిత్ ఆడగా, షాట్ మిస్సయ్యి ఆ బంతి అతని కుడి కాలికి తాకింది. దీనిపై అప్పీల్ చేయగా, అంపైర్ వెంటనే ఔటిచ్చాడు. అయితే ఎల్బీపై రివ్యూ కోసం రోహిత్ చాలా సేపు ఆలోచించి, తాత్సారం చేశాడు. అయితే మరో సెకన్లో టైమర్ ముగుస్తుందనగా, అతను రివ్యూ తీసుకున్నాడు. దీనిని థర్డ్ అంపైర్ పరిశీలించగా, బంతి లెగ్ వికెట్ ఆవతల పిచ్ అయినట్లు తేలింది. దీంతో రోహిత్ బతికి పోయాడు. ఈ మ్యాచ్ లో స్టన్నింగ్ అర్థ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ జట్టు భారీ స్కోరు సాధించేందుకు తన వంతు సాయం చేశాడు. ఇక రోహిత్ రివ్యూపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలామంది తమకు తోచిన కామెంట్లు చస్తూ, లైకులు, షేర్లతో వీడియోను వైరల్ చేస్తున్నారు.
Watch this video, Rohit Sharma took a review in the last seconds.
— Over and out (@Over_and_out1) May 1, 2025
This is Rohit DRS System #RRvsMI pic.twitter.com/gXHyyTaOwV
ముంబై భారీ స్కోరు..
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి బ్యాటర్లు అద్భుతమైన స్టార్ట్ నిచ్చారు. ముఖ్యంగా ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (36 బంతుల్లో 53, 9 ఫోర్లు)తో సత్తా చాటారు. వీరిద్దరూ ఆతిథ్య బౌలర్లను చితక్కొట్టారు. దీంతో పవర్ ప్లేలోనే 58 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా వీరిద్దరూ జోరు కొనసాగించడంతో బౌండరీల వర్షం కురిసింది. ముందుగా రికెల్టన్ 29 బంతుల్లో ఫిప్టీ బాదాడు. ఆ తర్వాత రోహిత్ 31 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసుకున్నాడు. ఫస్ట్ రికెల్టన్ ఔట్ కావడంతో 116 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ కూడా పెవిలియన్ కు చేరాడు.
Rohit Sharma took the DRS after the DRS time was over and he survived. This could happen only when Mumbai Indians plays. pic.twitter.com/hAOivvdsgR
— Alex (@alexluvxd) May 1, 2025
హార్దిక్, సూర్య విధ్వంసం..
సెట్ అయిన బ్యాటర్లు ఇద్దరు ఒకేసారి ఔట్ కావడంతో ముంబై కాస్త వెనుకడుగు వేసినట్లు అనిపించింది. అయితే నాలుగో నెంబర్లో సర్ప్రయిజ్ గా హార్దిక్ బ్యాటింగ్ దిగి, సత్తా చాటాడు. వీరిద్దరూ మెరుపు బ్యాటింగ్ చేయడంతో ముంబై భారీ స్కోరు చేసింది. వీరిద్దరూ సరిగ్గా చెరో 23 బంతులాడి సరిగ్గా 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఇందులో సూర్య 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదగా, హార్దిక్ మాత్రం 6 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. దీంతో ముంబై 215+ పరుగులు మార్కును దాటింది.




















