IPL 2024: హోలీ రంగులతో క్రికెటర్ల సందడి
Cricketers Holi Celebrations: హోలీ రంగుల్లో స్టార్ క్రికెటర్లు తడిసి ముద్దయారు. ఓ వైపు ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ... క్రికెటర్లు కాసేపు సేద తీరారు.
Cricketers Holi Celebrations: హోలీ రంగుల్లో స్టార్ క్రికెటర్లు తడిసి ముద్దయారు. ఓ వైపు ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ... క్రికెటర్లు కాసేపు సేద తీరారు. హోలీ పర్వదినాన ఐపీఎల్ క్రికెటర్లు రంగుల్లో మునిగి తేలారు. చాలామంది క్రికెటర్లు ఉత్సాహంగా హోలీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సహచరులతో కలిసి రంగలు పూసుకుంటూ సందడి చేశారు. సూర్యకుమార్ యాదవ్ తన శ్రీమతితో కలిసి పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
చెన్నై బౌలింగ్ కోచ్ బ్రావో హోలీ సంబురాల్లో పాల్గొని తన ఆటపాటలతో అభిమానులను అలరించాడు. కోల్‌కత్తా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ ముఖానికి రంగులు పూసుకుని ఫోటోలకు పోజులివ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా ముఖం నిండా రంగులు పూసుకుని తన ఐపీఎల్ సహచరులతో కలిసి సెల్ఫీ దిగాడు. కామెంటేటర్లు స్టీవ్ స్మిత్, స్టువర్ట్ బ్రాడ్ భారత సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ సంబురాలు చేసుకుంటూ ఫోటోలకు పోజులిచ్చారు.
రెండో సమరానికి బెంగళూరు రెడీ:
తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. కింగ్స్ లెవన్ పంజాబ్(PBKS)తో జరుగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌ను తొలి గెలుపు రుచి చూడాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న బెంగళూరు.... బౌలింగ్‌లో మాత్రం తేలిపోతుండడం ఆ జట్టును కలవరపెడుతోంది. కానీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడనుండడం బెంగళూరుకు కలిసిరానుంది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింతే పంజాబ్ కింగ్స్‌పై బెంగళూరుకు విజయం కష్టం కాకపోవచ్చని మాజీలు అంచనా వేస్తున్నారు.
ఆత్మ విశ్వాసంతో పంజాబ్
తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఇరు జట్లు పోరాడినా చివరికి గెలుపు పంజాబ్‌నే వరించింది. శామ్ కరణ్ 63 పరుగులతో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. లివింగ్ స్టోన్ కూడా చివరి వరకూ క్రీజులో నిలిచి పంజాబ్‌ను గెలిపించాడు. వీరందరూ మరోసారి రాణిస్తే బెంగళూరుపై పంజాబ్ విజయం సాధించే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషక్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్రియా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.