RCB VS PBKS: గెలిస్తే నిలవొచ్చేమో.. ఓడితే మాత్రం ఇంటికే... ఆర్సీబీ తో పంజాబ్ కింగ్స్ బిగ్ మ్యాచ్
IPL 2024: ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. దాదాపు నిర్జీవంగా ఉన్న ప్లే ఆఫ్ ఆశలకు ఏమాత్రమైనా ఊపిరి పోయాలంటే కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్, బెంగుళూరు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి.
RCB VS PBKS: ఐపీఎల్2024 లో గురువారం మరో రసవత్తర పోరు జరగనుంది. దాదాపు నిర్జీవంగా ఉన్న ప్లే ఆఫ్ ఆశలకు ఏమాత్రమైనా ఊపిరి పోయాలంటే కచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో పంజాబ్, బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో జరుగనున్న ఈ 58వ మ్యాచ్‌కు ధర్మశాల వేదిక కానుంది. ఇది పంజాబ్ హోం గ్రౌండ్స్‌లో ఒకటి. చల్లటి వాతావరణంలో రాత్రి 7.30 మొదలవ్వనున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్లో మాత్రం కాక రగిలిస్తోంది. ఎందుకంటే ఇరు జట్లకీ దాదాపు ప్లే ఆఫ్ ఆశలు మృగ్యమయ్యాయి. ఉన్న 1 నుంచి 4 శాతం ఆశనైనా కొంచెం గట్టిగా పట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గి తీరాలి. ప్రస్తుతం రెండు టీమ్‌లు తలో ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. ఆర్‌సీబీ ఏడో ప్లేస్‌లో, పంజాబ్ ఎనిమిదో ప్లేస్‌లో పాయింట్ల పట్టికలో కొనసాగుతున్నాయి.
బిగ్ హిట్టింగ్ చూడలేమా..?
ధర్మశాల గ్రౌండ్లో ఇప్పటి వరకూ ఉన్న ఐపీఎల్ గణాంకాల ప్రకారం గురువారం మ్యాచ్ మరీ హై స్కోరింగ్ మ్యాచ్ కాదు, అలాగని మరీ లోయెస్ట్ టోటళ్లు కూడా పోస్టవ్వవు. మధ్యస్థంగా స్కోర్లుండడే అవకాశముంది. అంటే బిగ్ స్కోరింగ్ మ్యాచ్ కాదనే విషయం తేలిపోయింది. ప్లేయర్లు ధనాధన్ రెచ్చిపోయే ఛాన్స్ లేదు. స్లోగా సెట్ అయ్యే విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్‌కి కరెక్టుగా అనుకూలించే గ్రౌండిది.
గణాంకాలిలా...
ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 12 మ్యాచుల్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీం ఏడు సార్లు గెలవగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయిదిట్లో గెలిచింది. టాప్ స్కోర్ 232-2 , లోయెస్ట్ టోటల్ 115 ఆలౌట్ రెండూ పంజాబ్ పేరిటే ఉన్నాయి.
హెడ్ టు హెడ్ ఇలా..
పంజాబ్, ఆర్సీబీ 32 ఐపీఎల్ మ్యాచ్‌లలో తలపడగా 15 ఆర్సీబీ గెలిచింది. 17 మ్యాచ్‌లలో పంజాబ్ గెలిచింది. సో ఈ మ్యాచ్‌లో ఇద్దరికీ దాదాపు సమాన విజయావకాశాలున్నాయి. గత మూడు మ్యాచ్‌లలో ఆర్‌సీబీ మూడు వరుస విజయాలు సాధించి మంచి టచ్లో ఉండగా పంజాబ్ లాస్ట్ త్రీ గేమ్స్ లో లాస్ట్ వన్ చెన్నైతో ఓటమి పాలైంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బ్యాట్స్ మెన్ వైఫల్యంతో చతికిలపడింది. మరోవైపు బెంగుళూరు ఈ సీజన్లు స్టార్టింగ్‌తో పోలిస్తే చాలా మెరుగైన ఫామ్‌లోకి వచ్చింది. ఈ సీజన్ స్టార్టింగ్‌లో ఆర్సీబీతో బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యచ్‌లో పంజాబ్ 176 పరుగుల చేయగా బెంగుళూరు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 77 పరుగులతో ఈ మ్యాచ్‌లో మెరిశాడు. పంజాబ్ పై బెంగుళూరు ఆటగాళ్లు కోహ్లీకి, డుప్లెసిస్‌కి మంచి రికార్డు ఉంది.
పంజాబ్‌కు బ్యాట్స్మెన్ కలవరం..
పంజాబ్ బ్యాటింగ్లో టాపార్డర్ మొత్తం విఫలమవుతుంది. బెయిర్‌స్టో సెంచరీ కొట్టాక మళ్లీ ఆ రేంజ్‌లో ఆడలేదు. రూసో కూడా తనదైన బ్యాంటింగ్ చేయట్లేదు. ప్రభుసిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్ తప్ప ఎవ్వరూ బాగా ఆడట్లేదు. ఈ సారి శిఖర్ ధావన్ టీమ్‌తో పాటు ధర్మశాల రాలేదు కాబట్టీ.. ఆయన టీంలో ఉండే అవకాశం లేదు. పంజాబ్ ప్లేయర్లలో రాహుల్ ఛహర్ బౌలింగ్ బాగుంది సీఎస్‌కేతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. ఇదే మ్యాచ్‌లో హర్ప్రీత్ బ్రార్ కొంత ఎక్స్‌పెన్సివ్ బౌలింగ్ వేశాడు. ఇదే పంజాబ్‌కు సమస్యగా మారింది. ఒక స్పిన్నర్ రాణిస్తే ఒకరు విఫలమవ్వడం వారికి అపజయాలకు కారణమవుతోంది. పేస్ బౌలర్లలో అర్షల్ పటేల్ మంచి టచ్‌లో ఉన్నాడు. 17 వికెట్లతో ఈ సీజన్‌లో సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా మెరిశాడు. అర్షదీప్, రబాడా వంటి వాళ్లతో పేస్ యూనిట్ అంతా బాగుంది. శ్యామ్ కరణ్ కూడా బాగానే వేస్తున్నాడు.
బెంగుళూరు కథ మారింది..
మొదటి ఆరు మ్యాచ్‌లలో పేలవమైన ఆటతీరు ప్రదర్శించిన బెంగుళూరు.. గత అయిదు మ్యాచుల్లో కొంత మెరుగ్గా ఆడుతోంది. బ్యాట్స్‌మెన్ మెరుస్తున్నారు. ఫ్యాఫ్ డుప్లెసిస్ ఫామ్ లోకి వచ్చాడు. కోహ్లీ, డుప్లెసిస్, విల్‌జాక్, రజత్ పటీదార్‌లతో కూడిన టాపార్డర్ బలంగా కనపడుతోంది. గత అయిదు మ్యాచుల్లో రెండు అర్ధసెంచరీలు బాది డూప్లెసిస్ మంచి టచ్‌లో ఉన్నాడు. ఈ అయిుదు మ్యాచుల్లో మొదటి అయిదు ఓవర్లలో వీళ్ల నెట్ రన్ రేట్ 12.3 గా ఉంది. మొదటి ఆరు మ్యాచ్‌లలో 8.3 కి మించలేదు. స్పిన్నర్లపై కూడా మొదటి తో పోల్చుకుంటే మెరుగ్గా రన్స్ సాధిస్తున్నారు. గతంలో పోలిస్తే కోహ్లీ కూాడా మంచి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. గ్లెన్ మాక్స్వెల్ చాలా గ్యాప్ తరువాత టీమ్లోకి తిరిగొచ్చాడు. గుజరాత్ పై ఆర్సీబీ గెలుపు కోసం ఒక వికెట్ కూడా తీశాడు. కానీ బ్యాటింగ్ విషయంలో డకౌటై నిరాశ పరిచాడు. బెంగుళూరు ఇతన్ని ఈ మ్యాచ్‌లో అడించే అవకాశం ఉంది. లేదా అతని ప్లేస్‌లో రీస్ టోప్లేని తీసుకోవచ్చు అలాగే రజత్ పటిదార్, యశ్ దయాళ్ ఇద్దర్లో ఒకరు టీమ్‌లో ఉండే అవకాశం ఉంది.
హోం గ్రౌండ్ అయినా..
ధర్మశాల పంజాబ్ హోమ్ గ్రౌండ్లలో ఒకటైనప్పటికీ సొంత గడ్డపై పంజాబ్ రికార్డు అంత గొప్పగా లేదు. బయట గ్రౌండ్లలో అయిదిట్లో మూడు గెలవగా ఇప్పటి వరకు హోమ్ గ్రౌండ్స్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో పంజాబ్ ఒక్కటే గెలిచింది. పంజాబ్ చివరి అయిదు మ్యాచ్‌లలో మూడిట్లో ఓడగా.. రెండిట్లో గెలిచింది. ఆర్ సీబీ చివరి అయిదు మ్యాచ్‌లలో మూడు వరస విజయాలు సాధించగా అంతకు ముందు రెండు ఓడిపోయింది.
పంజాబ్ టీమ్ ఇలా ఉండే అవకాశముంది
ప్రభ్‌సిమ్రన్ సింగ్, జానీ బైర్‌స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్. జితేశ్ శర్మ (కీపర్), అశుతోశ్ శర్మ, శామ్ కరణ్(కెప్టెన్), హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చాహార్, అర్షదీప్ సింగ్
బెంగుళూరు టీమ్ ఇలా ఉండే అవకాశముంది.
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కెమెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (కీపర్), స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ యశక్, యశ్ దయాళ్
టాస్ గెలిస్తే
గతంలో ధర్మశాలలో జరిగిన మూడు మ్యాచ్ లలో టాస్ గెలిచిన కెప్టెన్లు బౌలింగ ఎంచుకున్నారు. వీటిలో ఒక్కసారే బౌలింగ్ చేసిన టీం గెలిచింది. పంజాబ్ చెన్నైతోఆడినప్పుడూ ఇదే జరిగింది