అన్వేషించండి

IPL 2024: తరలివస్తున్న దిగ్గజ ఆటగాళ్లు, మొదలైన ఐపీఎల్‌ ఫీవర్‌

IPL 2024: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు కప్పును కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.

Team Players ready : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఈ సారి కప్పును కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆటగాడు.. వారి ప్రాంచైజీ జట్టుతో చేరుతున్నారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Sreyas iyer) పీఎల్‌ కోసం కోల్‌కతాలో అడుగుపెట్టాడు. వెన్నునొప్పి గాయంతో లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముందన్న వార్తలను తోసిపుచ్చుతూ అయ్యర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్యాంప్‌లో జట్టుతో చేరాడు. కెప్టెన్‌ అయ్యర్‌ వచ్చేశాడంటూ కేకేఆర్‌ తమ సోషల్‌మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేసింది. గాయం కారణంగా గత సీజన్‌కు పూర్తిగా అయ్యర్‌ దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌ కోసం ఆస్ట్రేలియా హార్డ్‌హిట్టర్‌ ట్రావిస్‌ హెడ్‌... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో చేరాడు. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలువడంలో కీలకంగా వ్యవహరించిన హెడ్‌..ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో ఆడబోతున్నాడు. సరిగ్గా ఏడేండ్ల క్రితం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన హెడ్‌..ఇప్పుడు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన ఆగమనంపై హెడ్‌ మాట్లాడిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జట్టు మెరుగ్గా కనిపిస్తోందని అన్నాడు.

కోహ్లీ ఆగయా...
ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా రన్‌ మెషీన్‌, స్టార్ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ వచ్చేశాడు. ఐపీఎల్‌ 2024లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాడు. ముంబైవిమానాశ్రయంలో విరాట్ కనిపించారు. గత రెండు నెలలుగా కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్న విరాట్‌... తొలి మ్యాచ్‌ ఆడేందుకు స్వదేశానికి వచ్చాడు. కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిక్షణ శిబిరంలో చేరనున్నాడు. కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు కోహ్లి విరామం తీసుకున్నట్లు తర్వాత స్పష్టమైంది. కోహ్లి, అనుష్క దంపతులకు ఇప్పటికే ఓ కూతురున్న సంగతి తెలిసిందే. విరాట్‌ సతీమణి అనుష్క శర్మ ఇటీవల లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు అకాయ్‌ అనే పేరును పెట్టినట్లు విరాట్‌, అనుష్కశర్మలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబంతో గడిపేందుకు లండన్‌ వెళ్లిన కోహ్లీ.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. 

ధోనీతోనే తొలి యుద్ధం
తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌(Mohammad Kaif)... కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని... కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారని... కోహ్లీ తీరు దానికి భిన్నమని కైఫ్‌ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ మరింత ప్రమాదకరంగా ఆడతాడని.... ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకమని కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget