అన్వేషించండి
Advertisement
IPL 2024: హైదరాబాద్ జయభేరి , మెరిసిన తెలుగు కుర్రాడు
PBKS vs SRH : పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.
PBKS vs SRH IPL 2024 Sunrisers Hyderabad won by 2 runs: పంజాబ్ కింగ్స్‌తో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు అయిదు సిక్సర్లతో 64 పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది.
అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌ఆరంభంలో లక్ష్యం దిశగానే సాగలేదు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్‌కు పరుగులు రావడం గగనమైపోయింది. కానీ శశాంక్‌సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేసిన శశాంక్, 15 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన అషుతోష్ శర్మపంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులుకావాల్సి ఉండగా 26 పరుగులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నితీశ్‌కుమార్ రెడ్డి ఒక్కడే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ 27 పరుగులు జోడించారు. 15 బంతుల్లో నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేసిన ట్రానిస్ హెడ్‌ను అవుట్ చేసి అర్ష్‌దీప్ తొలి షాక్ ఇచ్చాడు. అదే స్కోరుపై మార్క్రమ్ కూడా అవుటయ్యాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్...హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రాహుల్ త్రిపాఠి 11, క్లాసెన్ తొమ్మిది పరుగులు చేసి అవుటవ్వడంతో హైదరాబాద్ స్కోరు అసలు 130 అయినా దాటుతుందా అనిపించింది. కానీ తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి తన ఆటతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. నితీశ్ కొట్టిన సిక్సులు చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. ఐపీఎల్‌లో నితీశ్ తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. హర్ ప్రీత్ బార్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదిన నితీశ్... 32 బంతుల్లోనే అర్థ శతకం మార్క్ అందుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన నితీశ్ కూడా పెవిలియన్ చేరాడు. మళ్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అర్ష్‌దీప్ షాక్ ఇచ్చాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4, శామ్‌కరణ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.
పోరాడిన శశాంక్, అషుతోష్
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే బెయిర్ స్టోను కమిన్స్ అవుట్ చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 4, ధావన్ 14, శామ్ కరణ్ 29, సికిందర్ రాజా 28 పరుగులకు పెవిలియన్ చేరడంతో పంజాబ్ ఓటమి ఖారారని అందరూ భావించారు. కానీ శశాంక్‌సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సుతో 46 పరుగులు చేసిన శశాంక్, 15 బంతుల్లో 3 పోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన అషుతోష్ శర్మ పంజాబ్‌కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులుకావాల్సి ఉండగా 26 పరుగులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion