అన్వేషించండి

IPL 2024: హైదరాబాద్‌దే తొలి బ్యాటింగ్‌ - బ్యాటర్లు మళ్లీ జూలు విధిస్తారా

PBKS vs SRH: ముల్లాన్‌పుర్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

PBKS vs SRH IPL 2024 Punjab Kings opt to bowl: ముల్లాన్‌పుర్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే పరుగుల సునామీ సృష్టించిన హైదరాబాద్‌ బ్యాటర్లు మరోసారి జూలు విదిలిస్తే...పంజాబ్‌కు కష్టాలు తప్పవు. హైదరాబాద్‌ జట్టు ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి దూకుడైన ఆరంభం ఇవ్వాలని చూస్తున్నారు. మిడిలార్డర్‌లో క్లాసెన్, ఐదెన్‌ మార్‌క్రమ్‌ కూడా బ్యాట్‌ను ఝళిపించడం హైదరాబాద్‌కు కలిసి రానుంది. అయితే కఠినమైన పిచ్‌లపై దూకుడుగా ఆడటంలో హైదరాబాద్‌ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. గుజరాత్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో 170 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. ఇప్పుడు ఈ పిచ్‌పై హైదరాబాద్‌ బ్యాటర్లు ఎలా రాణిస్తారో వేచి చూడాలి. చెన్నై, ముంబై వంటి పటిష్ఠమైన జట్లను ఓడించిన హైదరాబాద్‌... పంజాబ్‌పైనా గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని పట్టుదలతో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందు ఉండాలంటే ప్రతీ మ్యాచ్‌ ఫలితం కీలకం కావడంతో ఏ  అవకాశాన్ని వదిలి పెట్టవద్దని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. 

 
పంజాబ్‌ కూడా బలంగానే...
పంజాబ్‌ బ్యాటింగ్‌ విభాగంలో శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టోలతో ఓపెనింగ్‌ జోడీ చాలా బలంగా ఉంది. ధావన్‌ నిలకడగా పరుగులు చేస్తుండగా.. బెయిర్‌స్టో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు యత్నిస్తాడు. మిడిలార్డర్‌లో జితేశ్, లివింగ్‌స్టోన్‌తోపాటు కొత్త స్టార్లుగా మారిన శశాంక్‌ సింగ్‌ - అషుతోష్‌ శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడతారు. వీరిని హైదరాబాద్‌ బౌలర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 
 
సన్‌రైజర్స్‌ జోరు సాగేనా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్లు... దూకుడుగా ఆడి మరోసారి భారీ స్కోర్లు నమోదు చేయాలని చూస్తున్నారు. ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్ కింగ్స్‌పైనా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్ దూకుడుగా ఆడుతూ హైదరాబాద్‌కు విజయాలు అందిస్తున్నారు. అభిషేక్‌ శర్మ, ట్రానిస్‌ హెడ్‌ సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభాలు అందిస్తున్నారు. మరోసారి వీరు విజృంభిస్తే పంజాబ్‌కు తిప్పలు తప్పవు. హైదరాబాద్‌ను బౌలింగ్‌ విభాగం ఆందోళనకు గురిచేస్తోంది.  హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. భువనేశ్వర్ గత మ్యాచ్‌లో వికెట్ సాధించినా కొత్త బంతితో ఇబ్బంది పడ్డాడు. నటరాజన్ ఇప్పటివరకు నాలుగు వికెట్లే నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన కెప్టెన్‌ పాట్ కమ్మిన్స్ ఇంకా రాణించాల్సి ఉంది. 
 
జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: జయదేవ్ ఉనద్కత్, ఝటవేద్ సుబ్రమణ్యన్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూఖీ, పాట్ కమిన్స్ (కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్, అబ్హ్ జాన్సేన్, అబ్హ్ జాన్సేన్ ఉపేంద్ర యాదవ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఆకాష్ మహరాజ్ సింగ్, వనిందు హసరంగా, ఉమ్రాన్ మాలిక్. 
 
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా ., విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌ.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget