T20 World Cup: T20 ప్రపంచకప్ కోసం, జట్లను ప్రకటించిన నేపాల్, ఒమన్
T20 World Cup 2024: వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్ 2024 కోసం నేపాల్, ఒమన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి.
Nepal and Oman announced teams for T20 World Cup 2024: వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్(T20 World cup) 2024 కోసం అన్ని జట్లు టీమ్‌లను ప్రకటించాయి. ఈ మెగా టోర్నీ కోసం నేపాల్(Nepal), ఒమన్(Oman) క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ ప్రపంచకప్‌లో తమను తాము నిరూపించుకోవాలని చూస్తున్న ఈ రెండు జట్లు 15 మందితో జట్లను ప్రకటించాయి. నేపాల్ క్రికెట్ అసోసియేన్ ప్రకటించిన జట్టుకు రోహిత్ పౌడెల్ నాయకత్వం వహిస్తాడు. దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్షన్ ఝా, కుశాల్ భుర్టెల్ వంటి కీలక ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. నేపాల్ ప్రస్తుతం వెస్టిండీస్ Aతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు, నేపాల్ మంచి ప్రదర్శన కనబరిచింది. ఈ సిరీస్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ సెంచరీ చేయడం విశేషం. ఒమన్ కూడా తమ జట్టును ప్రకటించింది. త్వై స్థానంలో అకిబ్ ఇలియాస్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది.
టీ 20 ప్రపంచ కప్ నేపాల్ జట్టు :
రోహిత్ పాడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ షా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్, సందీప్ జోరా, అబినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ,
T20 ప్రపంచ కప్ ఒమన్ జట్టు: అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్ కశ్యప్, ప్రజాపతి ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్,
రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా
త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ (BCCI) సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసింది. 15 మంది ఆటగాళ్లతో పాటు నలుగురు రిజర్వ్ ప్లేయర్లను సైతం ప్రకటించింది.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్ ), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్) యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్ ), రిషబ్ పంత్ (వికెట్ కీపర్ ), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ పై శ్రీకాంత్ మండిపాటు
టీ20 ప్రపంచ కప్ కోసం జరిగిన ఆటగాళ్ల ఎంపికపై పలువురు మాజీ దిగ్గజాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో రింకూకు చోటు లేకపోవడంపై 1983 వరల్డ్ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రింకూ సింగ్ దక్షిణాఫ్రికాలో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని గుర్తుచేశారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 4 వికెట్లు కోల్పోయి 22 పరుగులకు పరిమితం కాగా, రోహిత్ శర్మ చేసిన పని గుర్తుందా? రింకూ సింగ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో టీమ్ 212 పరుగులు చేసిందన్నారు. రింకూ సింగ్ టాలెంటెడ్ ప్లేయర్, ఇది చాలా చెత్త సెలక్షన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.