By: ABP Desam | Updated at : 22 May 2023 02:12 AM (IST)
మ్యాచ్‌లో భారీ షాట్ కొడుతున్న కామెరాన్ గ్రీన్ ( Image Source : PTI )
Sunrisers Hyderabad vs Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 18 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకుంటున్నాడు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో వారు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటారు. ఆ మ్యాచ్ రద్దయినా, బెంగళూరు ఓటమి పాలైనా ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (100 నాటౌట్: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (56: 37 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో ఫాంలోకి వచ్చాడు.ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (83: 46 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు), వివ్రాంత్ శర్మ (69: 47 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
సన్‌రైజర్స్‌కు సూపర్ స్టార్ట్
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ (69: 47 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ (83: 46 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరును పరుగెత్తించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో అతి పెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం ఇదే.
ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా వివ్రాంత్ శర్మ నిలిచాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 220 నుంచి 230 పరుగుల వరకు చేస్తుందనిపించింది. కానీ ఆకాష్ మధ్వాల్ వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ స్కోరింగ్ వేగం కూడా మందగించింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ నాలుగు వికెట్లు, క్రిస్ జోర్డాన్ ఒక వికెట్ పడగొట్టారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్, నితీష్ రెడ్డి, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, అకేల్ హోసేన్, అబ్దుల్ సమద్
ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్
ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, సందీప్ వారియర్
Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం