అన్వేషించండి
Advertisement
IPL 2024: వర్షం వల్ల ఆలస్యం, ముంబై ముందు మోస్తరు లక్ష్యం
MI Vs KKR , IPL 2024: వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించడంతో ముంబయితో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.
MI Vs KKR IPL 2024 Mumbai Indians target 157: వర్షం అంతరాయం కలిగించి ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI)పై కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 42, నితీశ్ రాణా 33 పరుగులతో రాణించారు. చివరో రికూ సింగ్ ధాటిగా ఆడాడు. ఆరంభంలో బాగా రాణించిన ముంబై బౌలర్లపై చివర్లో కోల్‌కత్తా బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శించారు.
ఆరంభంలో తడబడినా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై,... కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే కోల్‌కత్తాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆరు పరుగులు చేసి సాల్ట్ ఔట్ అయ్యాడు. తుషారా వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి సాల్ట్ ఔటయ్యాడు. తుషార్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి సాల్ట్ కంబోజ్ చేతికి చిక్కాడు. వెంకటేశ్ అయ్యర్ క్రీజులోకి రాగానే ఫోర్ బాదాడు. ఆ తర్వాత వెంటనే కోల్‌కతా రెండో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ సునీల్ నరైన్ బౌల్డయ్యాడు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న నరైన్ డకౌట్ కావడంతో కోల్‌కత్తా కేవలం 15 పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. రెండు ఓవర్లలోనే ఓపెనర్లు ఔటవ్వడంతో కోల్‌కతా ఒత్తిడిలో పడింది. కంబోజ్ వేసిన మూడో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ సిక్సర్ బాదాడు. 3 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 25/2. వెంకటేశ్ అయ్యర్... బుమ్రా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదాడు. నాలుగు ఓవర్లకు కోల్‌కత్తా స్కోరు 40 పరుగులు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న వేళ కోల్‌కత్తాకు మరో షాక్ తగిలింది. కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది. కంబోజ్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి ఏడు పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్ బౌల్డయ్యాడు.
అయిదు ఓవర్లకు కోల్‌కత్తా స్కోరు 45/3. హార్దిక్ పాండ్య వేసిన ఆరో ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్య వేసిన ఎనిమిదో ఓవర్‌లో నితీశ్ రాణ వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. అర్ధ సెంచరీ దిశగా సాగుతున్న వెంకటేశ్ అయ్యర్ ఔట్ అయ్యాడు. దూకుడుగా ఆడిన వెంకటేశ్ అయ్యర్ 21 బంతులలో 42 పరుగులు చేసి పీయూష్ చావ్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చి రాగానే ఆండ్రీ రస్సెల్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. 9 ఓవర్లకు స్కోరు 87/4. నువాన్ తుషాన్ వేసిన 10 ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లో కోల్‌కతా స్కోరు 100 దాటింది. తర్వాత 33 పరుగులు చేసిన నితీశ్ రాణ అవుటయ్యాడు. దీంతో కోల్‌కత్తా ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన ఓవర్‌లో నితీష్‌రాణాను తిలక్ వర్మ... నితీశ్‌రాణాను రనౌట్ చేశాడు. కాసేపటికే కోల్‌కతాకు బిగ్ షాక్ తగిలింది. 14 బంతుల్లో 24 పరుగులు చేసిన రస్సెల్... పీయూష్ చావ్లా వేసిన 13 ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడి డీప్ స్క్వేర్ లెగ్‌లో కంబోజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 13 ఓవర్లకు స్కోరు 125/6. హార్దిక్ పాండ్య వేసిన 14 ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. రింకు సింగ్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. నిర్ణీత 16 ఓవర్లలో కోల్‌కత్తా ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion