IPL 2024: బ్యాటింగ్ కు దిగిన లక్నో, RRపై ప్రతీకారం తీర్చుకుంటుందా ?
LSG vs RR, IPL 2024: ఐపీఎల్ 44వ మ్యాచ్‌లో రాజస్థాన్ , లక్నో తో తలపడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది.
LSG vs RR IPL 2024 Rajasthan Royals opt to bowl: ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోవటం తో లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో బ్యాటింగ్ కి దిగింది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్... నాలుగో స్థానంలో ఉన్న లక్నోతో అమీతుమీ తేల్చుకోనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై మరోసారి విజయం సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎనిమిది మ్యాచులు ఆడిన రాజస్థాన్ ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. లక్నో కూడా ఎనిమిది మ్యాచులు ఆడి అయిదు మ్యాచుల్లో విజయం సాధించి మూడు పరాజయాలతో నాలుగో స్థానంలో ఉంది. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్ భీకర ఫామ్‌లో ఉంది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌లో రియాన్ పరాగ్ ఫామ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసిరానుంది.
లక్నో ప్రతీకారం తీర్చుకుంటుందా..?
రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. KL రాహుల్ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించి ఆత్మ విశ్వాసంతో ఉంది. క్వింటన్ డి కాక్ మెరుపు బ్యాటింగ్ చేయాలని చూస్తున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ అజేయ శతకం చేసి ఫామ్‌లోకి రావడం లక్నోకు కలిసిరానుంది.
రికార్డ్స్
ఐపీఎల్‌లో ఈ రెండు టీమ్‌ల మధ్య 4 మ్యాచ్‌లు జరగ్గా రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్‌లు గెలవగా, లక్నో ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ ఆటగాళ్ల పోరు చూడాల్సిందే
ఇక రెండు టీమ్‌ల్లో ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉండనుంది అంటే...లక్నో విధ్వంస ఓపెనర్ క్వింటన్ డికాక్ వర్సెస్ సందీప్ శర్మ గురించే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో వీళ్లిద్దరి మధ్య ఆసక్తికర సమరం ఉండనుంది. తర్వాత మిడిల్ ఆర్డర్‌లో కేయల్ రాహుల్ కి చాహల్, అశ్విన్ ల మధ్య పోరు ఉంటుంది. మిడిలార్డర్ లో ఇది మరో ఆసక్తికర అంశం గా చెప్పొచ్చు. రాహుల్ స్పిన్ బౌలింగ్ ని బాగా ఆడగలడు. కానీ వీళ్లిద్దరూ రాహుల్ కి సవాల్ విసరగలరు. ఇక భీకర ఫాంలో ఉన్న యశస్వి జెశ్వాల్ కి మార్కస్ స్టొయినస్ అడ్డుగా నిలబడబోతున్నాడు. ఈ ఆటగాళ్ల పోరు అభిమానులకు కనువిందు చేయనుంది. అలాగే ఈ ఆటగాళ్ల ప్రదర్శన బట్టి జట్టు విజయం ఆధారపడి ఉంటుంది. లక్నో,రాజస్థాన్ జట్లు తలపడింది తక్కువ మ్యాచ్‌లే అయినా వీరి మధ్య పోరు చివరి బాల్ వరకు వెళ్తుంది. ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోరు. కాబట్టి ఈ మ్యాచ్‌కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి రాజస్‌థాన్, లక్నోజట్లు తమ మొదటిమ్యాచ్‌లో గెలిచి ఎవరు టోర్నమెంట్‌లో ముందడుగు వేస్తారో మరికాసేపట్లోతేలిపోనుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ సంజు శాంసన్ , రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు : KL రాహుల్ (c & wk), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్