అన్వేషించండి

IPL 2024: గుజరాత్ పై లక్నో ఘన విజయం, 130 పరుగులకే ఆలౌట్

LSG vs GT: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో గుజరాత్ మొత్తం వికెట్లు 130 పరుగులకే కుప్పకూలింది.

LSG vs GT IPL 2024  Lucknow Super Giants won by 33 runs:   గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. లక్ష్యఛేదనలో గుజరాత్ మొత్తం వికెట్లు కోల్పోయి 130 పరుగులకే కుప్పకూలింది.  

స్వ‌ల్ప ఛేద‌నలో గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) క‌ష్టాల్లో ప‌డింది. రెండు ప‌రుగుల వ్య‌వ‌ధిలో కీల‌క వికెట్లు కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వ‌చ్చిన‌ కేన్ విలియ‌మ్స‌న్(1) వెనుదిరిగాడు. ర‌వి బిష్ణోయ్ ఓవ‌ర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు ఎగిరి మరీ బిష్ణోయ్ ఆ బంతిని అందుకున్నాడు. దాంతో, 56 ప‌రుగుల‌కే రెండో వికెట్ ప‌డింది. అంతకుమందు య‌వ్ ఠాకూర్ బౌలింగ్‌లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్(19) ఔట‌య్యాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవ‌ర్ ఆఖ‌రి బంతికి బౌల్డ‌య్యాడు. దాంతో, 54 ప‌రుగుల వద్ద గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో  పవర్‌ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 54/1. కృనాల్ పాండ్య కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.  తరువాత కృనాల్ పాండ్య వేసిన 13 ఓవర్‌లో తొలి బంతికి దర్శన్‌ నల్కండే దొరికిపోయాడు. తరువాత నుంచి గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. గుజరాత్ జట్టులో ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరారు.న్ దీంతో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. 

అలా మొదలయ్యింది.. 

ఐపీఎల్‌- సీజన్‌ 17 లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన  లఖ్‌నవూ  జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్ పెద్దగా రాణించలేకపోయారు. స్టాయినిస్‌ ఒక్కడే  అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ రాహుల్‌  33 పరుగులు , బదోని 20 పరుగులు చేయగా,  పూరన్‌ 32 పరుగులతో  రాణించారు. ఈ మ్యాచ్ లో  డికాక్‌, పడిక్కల్‌ లు  నిరాశపరిచారు. గుజరాత్‌ బౌలర్లలో దర్శన్‌, ఉమేశ్‌ చెరో 2 వికెట్లు తీయగా.. జాన్సన్‌ ఒక వికెట్‌  పడగొట్టి GTని కేవలం 163 పరుగులకే పరిమితం చేశారు.  

హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని  ఉపయోగించుకోలేకపోయారు.  ఎడాపెడా కొట్టడం మానేసి క్రీజ్లో ఉండటమే అవసరం అన్నట్టుగా ఆడిన మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్31 బంతుల్లో 3 ఫోర్లుతో 33 పరుగులు చేశాడు. మొత్తానికి   నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 5 వికెట్లు  నష్టానికి 163 పరుగులు చేసింది.  టాస్ గెలిచిబరిలో కు దిగిన‌ లక్నో కు ప్రారంభం లోనే షాక్ త‌గిలింది. టైటాన్స్ పేస‌ర్ ఉమేశ్ యాద‌వ్ విజృంభ‌ణ‌తో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. తొలి ఓవ‌ర్లోనే   డేంజ‌ర‌స్ ఓపెన‌ర్గా పేరున్న  క్వింట‌న్ డికాక్  ఆరుపరుగులకే  ఔట‌య్యాడు. తరువాత సేప‌టికే దేవ్‌ద‌త్ ప‌డిక్కల్‌ 7 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.   ఈ  దెబ్బతో ల‌క్నో 18 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్‌, మార్కస్ స్టోయినిస్‌ లు ఆచితూచి ఆడారు.  చివరలో నికోలస్ పూరన్ఆ యుష్ బదోని కు కాస్త  రాణించడంతో లక్నో 163 పరుగులు చేసింది.   గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేయలేకపోయారు. కానీ బౌలింగ్‌లో అద‌ర‌గొట్టి గుజ‌రాత్ టాప్‌గ‌న్స్‌ను 130కే క‌ట్ట‌డి చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Tirumala Tour: రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
IPS Transfers: ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Donald Trump: ట్రంప్ మావయ్యను ఏసేస్తారా? ఎందుకురా ఇంత స్కెచ్చేశారు?Nirmal News: చెట్టులో వెలిసిన దుర్గామాత, చీరకట్టి పసుపు కుంకుమతో పూజలుMahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Tirumala Tour: రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
రిజిస్టర్ లో సంతకం పెట్టాలని టీడీపీ, జనసేన డిమాండ్- జగన్ తిరుమల టూర్ వివాదం అవుతుందా?
IPS Transfers: ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
ఏపీలో 16 మంది ఐపీఎస్‌‌ల బదిలీ - సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, ఇంటెలిజెన్స్ ఐజీగా రామకృష్ణ
Devara OTT: దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
దేవర ఓటీటీ రిలీజ్... గ్యాప్ ఉంది గురూ, విజయ్ టీమ్ చేసిన తప్పు ఎన్టీఆర్ చేయలేదు!
Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
Sobhita Dhulipala: నాగచైతన్యతో పెళ్లి, పిల్లల గురించి ఓపెన్‌గా మాట్లాడిన శోభితా ధూళిపాళ
నాగచైతన్యతో పెళ్లి, పిల్లల గురించి ఓపెన్‌గా మాట్లాడిన శోభితా ధూళిపాళ
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Embed widget