అన్వేషించండి
Advertisement
IPL2024: మారాయ్- అన్నీ మారాయ్, సన్‌రైజర్స్ లేటెస్ట్ వర్షన్
Sunrisers Hyderabad: చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ రాణిస్తోంది. ఎదురుదాడికి దిగుతూ బౌలర్లను ఉతికేస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఉతికి ఆరేస్తోంది.
Sunrisers Hyderabad super version now: ఈ ఐపీఎల్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఆట చూస్తే.. మతిపోతోంది. చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ నిలకడగా రాణిస్తోంది. 021, 2022లో 8వ, 2023లో ఏకంగా10వ స్థానానికి పరిమితమైన సన్‌రైజర్స్ ఈసారి ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఎదురుదాడికి దిగుతూ బౌలర్లను ఉతికేస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఉతికి ఆరేస్తోంది. అరివీర భయంకర జట్లైన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్‌పై ఇప్పటికే విజయం సాధించిన హైదరాబాద్... ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై పిడుగులా పడింది. గత సీజన్‌లలో హైదరాబాద్‌తో మ్యాచ్ అంటే అభిమానులు సహా ఎవ్వరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ అభిమానులందరూ టీవీలకు, ఫోన్‌లకు అతుక్కుపోతున్నారు. గత సీజన్‌లో 200 పరుగులు చేసేందుకు సతమతమైన జట్టు తలరాత ఇప్పుడు మారింది. సునాయసంగా 200కుపైగా పరుగులను బాదేస్తోంది. ముంబైపై మెరుపు దాడి చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్.. తమ బ్యాటింగ్ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టి ఔరా అనిపించింది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఇదే జోరు కొనసాగిస్తే మరో కప్పు సన్‌రైజర్స్ ఖాతాలో చేరడం ఖాయం.
కమిన్స్ సారథ్యంలో
ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించిన ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారిపోయింది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉంది. కమిన్స్ హైదరాబాద్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ రాకతో సన్‌రైజర్స్ ఓపెనింగ్ చాలా బలంగా మారింది. అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. క్లాసెన్, మార్క్రమ్, సమద్, నితీశ్ రెడ్డితో బ్యాటింగ్ బలంగా మారింది. ఈ బ్యాటింగ్ బలంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. నిలకబడగా ఆడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తోంది.
బౌలర్లు కూడా గాడిన పడితే...
హైదరాబాద్ బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు నమోదు చేయడంతో బౌలింగ్ గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. భువనేశ్వర్ కుమార్ మినహా మిగతా బౌలర్లంతా ఘోరంగా విఫలమవుతున్నారు. ముంబైపై 277 పరుగులు చేసినా 31 పరుగుల తేడాతో... బెంగళూరుపై 287 పరుగులు చేసినా కేవలం 25 పరుగుల తేడాతో హైదరాబాద్ గట్టెక్కింది. దీంతో బౌలింగ్‌పై హైదరాబాద్ మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది.
చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సునామీల విరుచుకుపడి బెంగళూరు జట్టును ముంచేసింది. చిన్నస్వామి స్టేడియం హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో మార్మోగిపోయింది. సిక్సర్లు కొట్టడం ఇంత తేలికా అనేలా.. బౌండరీలే సింగల్ రన్స్‌గా మారిన వేళ హైదరాబాద్ సృష్టించిన సునామీలో... బెంగళూరు బౌలర్లు గల్లంతయ్యారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికే అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇప్పుడు ఆ రికార్డును కాల గర్భంలో కలిపేసింది. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 262 పరుగులకే పరిమితం కావడంతో హైదరాబాద్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
క్రికెట్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion