By: ABP Desam | Updated at : 23 Dec 2022 02:38 PM (IST)
IPL Player Auction 2023
IPL 2023 కోసం ఈరోజు జరగనున్న మినీ వేలంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు ఫోకస్‌లో ఉంటారు, అయితే కొంతమంది అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌లపై కూడా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టనున్నాయి. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా రాణిస్తున్న ఆటగాళ్లు వీరే.
ఇందులో మొదటి పేరు పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడే ఆల్ రౌండర్ సన్వీర్ సింగ్. సన్వీర్ మీడియం పేసర్, భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఈ ఆటగాడు స్పిన్నర్ల బౌలింగ్‌లో బాగా బ్యాటింగ్ చేయగలడు. వికెట్ కీపర్ బ్యాకప్ కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీలు తమిళనాడుకు చెందిన ఎన్ జగదీశన్ కోసం పోటీ పడుతుంది. విజయ్ హజారే ట్రోఫీలో జగదీషన్ ఐదు సెంచరీలు చేశాడు.
ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ తరఫున ఫినిషర్ పాత్ర పోషిస్తున్న ఆకాష్ వశిష్ట్, అతని సహచర ఆటగాడు వైభవ్ అరోరా కూడా బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఈ మూడింటితో పాటు ఫ్రాంచైజీల దృష్టి జమ్మూ కశ్మీర్‌కు చెందిన షారుక్ దార్, ముజ్తబా యూసుఫ్‌పై ఉంటుంది.
87 స్లాట్లు ఖాళీగా
ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలు మినీ వేలం కోసం 87 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 30 స్లాట్‌లలో విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు అంటే భారత ఆటగాళ్లకు కనీసం 57 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి వేలంలో 400 మందికి పైగా ఆటగాళ్లు ఉన్నారు. ఫ్రాంచైజీ జట్ల వద్ద ఉన్న మొత్తం రూ.206.5 కోట్లు.
WPL 2023: ప్లేఆఫ్స్‌కు మూడే జట్లు - మహిళల ఐపీఎల్లో వెరైటీ రూల్!
WPL Auction 2023: ఏంటీ పోటీ! WPL వేలంలో 90 మందికి 1000 పేర్లు నమోదు!
Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!
Womens IPL Bidders: రూ.1289 కోట్లతో WIPL ఫ్రాంచైజీ కొన్న అదానీ - 5 జట్ల విక్రయంతో బీసీసీఐ రూ.4669 కోట్ల సంపద!
Ravindra Jadeja Tweet: ఆ రెండు పదాలతో సీఎస్కే ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసిన జడ్డూ!
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!